నో టీ షర్ట్, జీన్స్…ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించిన మహారాష్ట్ర

Maharashtra Government issues dress code at work ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్​ కోడ్​ ప్రవేశపెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్,ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్​ ధరించి రావడంపై మహా ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్ధవ్​ సర్కార్ నిర్ణయంతో నచ్చిన బట్టలు వేసుకునే అవకాశం మహారాష్ట్ర ఉద్యోగులకు ఇకపై ఉండదు.ఈ మేరకు శుక్రవారం(డిసెంబర్-11,2020) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మహిళా ఉద్యోగులు చీరలు, చుడీదార్​ లు, కుర్తాలు, ట్రౌజర్​ ప్యాంట్లు ధరించాలి. షర్ట్​ లు ధరించేందుకు వీలుంది అయితే వాటిపై అవసరమైతే దుపట్టాలు వేసుకోవాలి. పురుష ఉద్యోగులకు మాత్రం తక్కువ అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. జీన్స్, టీ షర్ట్​లు వేసుకునేందుకు అనుమతి లేదు. ట్రౌజర్​ ప్యాంట్లు, షర్ట్​ లు మాత్రమే వేసుకోవాలి. ముదురు రంగు దుస్తులు, ఎక్కువగా డిజైన్ ప్యాట్రన్లు, బొమ్మలు ఉన్న దుస్తులు ధరించకూడదు.

మహిళలు చప్పల్, సాండల్స్, షూ వేసుకోవచ్చు. పురుషులు షూ లేదా సాండల్స్ మాత్రమే వేసుకోవాలి. స్లిప్పర్లు ధరించేందుకు అవకాశమే లేదు. చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు.. శుక్రవారం ఒక్క రోజైనా ఖాదీ దుస్తులు ధరించాలి.

అధికారులు మరియు ఉద్యోగుల వేషధారణ అనుచితమైనది మరియు అపరిశుభ్రమైనది అయితే అది వారి పనిపై కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందని శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్ లో ప్రభుత్వం పేర్కొంది. తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు