Amartya Sen : ఉమ్మడి పౌరస్మృతిపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Amartya Sen
Amartya Sen Comments Uniform Civil Code : కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి పౌరస్మృతిపై నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీ అంశం అర్థం లేని భావన అని విమర్శించారు. యూసీసీ భానవకు హిందూత్వకు సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. యూసీసీ చాలా ఏళ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని అన్నారు. ఈ మేరకు అమర్త్యసేన్ పశ్చిమబెంగాల్ లోని బిర్భూమ్ లో మాట్లాడారు.
హిందూత్వ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో యూసీసీకి సంబంధం ఉందని తెలిపారు. హిందూత్వ దుర్వినియోగం అవుతోందని వెల్లడించారు. దేశ ప్రగతికి హిందూత్వ ఒక్కటే మార్గం కాదని స్పష్టం చేశారు. యూసీసీ అమలులో అలసత్వానికి చోటివ్వకూడదని పత్రికల్లో చదివానని, ఇలాంటి అర్థం లేని భావన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మతం, ఆచారాల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఆ భేధాలను తొలగించి, భారతీయులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
Kerala Governor : యూనిఫాం సివిల్ కోడ్‌పై కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హిందూ దేశం ఆలోచనలో భాగంగానే కేంద్రం యూసీసీ తీసుకురావాలనుకుంటుందని.. ఇది తెలివి తక్కుక ఆలోచనగా అభిర్ణించారు. యూసీసీ అమలు చేసే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. ఇలాంటి ప్రయత్నాలతో ఎవరికి లాభమని ప్రశ్నించారు. ఈ కసరత్తును కచ్చితంగా హిందూ రాష్ట్ర ఆలోచనతో ముడిపడి ఉందన్నారు.
తాము వేలాది ఏళ్లుగా యూసీసీ లేకుండానే బతికామని, ఇది లేకుండా భవిష్యత్ లో కూడా బతకగలమని స్పష్టం చేశారు. కచ్చితంగా హిందూ మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. యూసీసీ అమలు చేసే ప్రయత్నాలు ప్రజల మధ్య చాలా వ్యత్యాసాలతో ఉన్న సంక్లిష్టమైన సమస్యను బహిరంగంగా సరళీకృతం చేయడమేనని తెలిపారు. దేశం పురోగమించే ఏకైక మార్గం హిందూ రాష్ట్రం కాదని పేర్కొన్నారు.