Padma Awards
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మ అవార్డులు-2025 ప్రకటించింది. పద్మ అవార్డులకు నామినేషన్ల ప్రక్రియ కొన్ని నెలల ముందే ప్రారంభమైంది. పద్మ అవార్డులకు ఎవరి పేరును వారు నామినేట్ చేసుకోవచ్చు.
ఈ అవార్డుల గ్రహీతల స్ఫూర్తితో, మీరు మీ రంగంలో అందిస్తున్న సేవలతో పద్మ అవార్డులు-2026 కోసం మీ పేరును మీరు నామినేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? సింపుల్ ప్రాసెస్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ పేరును మీరు నామినేట్ చేసుకోవచ్చు. కేంద్ర సర్కాను నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఈ దరఖాస్తు చేసుకోవాలి. జాతి, వృత్తి, ప్రాంతం, లింగ భేదం లేకుండా అందరూ పద్మ అవార్డులకు అర్హులే.
Read More: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర సర్కారు.. పూర్తి లిస్టు ఇదే..
ఈ విభాగాల్లో సేవ చేసినవారు అప్లై చేసుకోవచ్చు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ తెరచి, మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం మీ ఆధార్ ప్రకారం మీ పేరు, పుట్టిన తేది, ఫోన్ నంబర్ పొందుపర్చాలి. మీ నామినేషన్ టైప్‌ను ఎంచుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు ఎ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, కొత్త నామినేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. నామినీ వివరాలను పొందుపర్చాలి. ఫొటో, నామినేషన్ డాక్యుమెంటేషన్‌ను అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్‌పై క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.