Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర సర్కారు.. పూర్తి లిస్టు ఇదే..

బ్రెజిల్‌ వేదాంత గురు జోనస్‌ మాశెట్టి, హరియాణాకు చెందిన పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌ హర్వీందర్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త భీమ్‌ సింగ్‌ భవేశ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది.

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర సర్కారు.. పూర్తి లిస్టు ఇదే..

Updated On : January 25, 2025 / 9:41 PM IST

భారత్‌ ఆదివారం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పలు రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నవారికి కేంద్ర సర్కారు ఇవాళ పద్మ పురస్కారాలను ప్రకటించింది. బ్రెజిల్‌ వేదాంత గురు జోనస్‌ మాశెట్టి, హరియాణాకు చెందిన పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌ హర్వీందర్‌ సింగ్‌, బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త భీమ్‌ సింగ్‌ భవేశ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది.

అలాగే, పుదుచ్చేరి డోలు విద్వాంసుడు పి.దక్షిణా మూర్తి, నాగాలాండ్‌ వ్యవసాయం, పండ్ల రైతు ఎల్‌.హంగ్‌థింగ్‌, మధ్యప్రదేశ్‌ జానపద గాయకుడు బేరు సింగ్‌ చౌహాన్‌, కువైట్‌ యోగా గురు షేఖా ఎ.జె. అల్ సబాహ్‌, నేపాల్‌ జానపద గాయకుడు నరేన్‌ గురుంగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ యాపిల్‌ సాగుదారు హరిమన్‌ శర్మ, అరుణాచల్‌ ప్రదేశ్‌ సామాజిక కార్యకర్త జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌, మహారాష్ట్ర హోమియోపతి వైద్యుడు విలాస్‌ దాంగ్రే, కర్ణాటక జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్‌ పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.

పద్మశ్రీ అందుకోనున్న మరికొందరు

  • మధ్యప్రదేశ్‌ చేనేత కార్మికుడు సాల్లీ హోల్కర్‌
  • మహారాష్ట్రకు చెందిన మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లికు సాంస్కృతికం, విద్యలో..
  • రాజస్థాన్‌ జానపద కళాకారిణి బతూల్‌ బేగం
  • తమిళనాడు డప్పు వాద్యకారుడు వేలు ఆసన్‌
  • కర్ణాటక భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతరకు తోలుబొమ్మలాటలో..
  • గుజరాత్ చేనేత కార్మికుడు పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌
  • కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి దేశ్‌మానేకు వైద్యంలో..
  • మహారాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కార్యకర్త చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌
  • మధ్యప్రదేశ్‌ జగదీశ్‌ జోషిలా (సాహిత్యంలో కృషి చేసినందుకు)
  • ఢిల్లీకి చెందిన నీర్జా భట్లా (గైనకాలజీలో కృషి చేసినందుకు)
  • ఉత్తరాఖండ్‌కు చెందిన హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య, ట్రావెల్‌లో)
  • బిహార్‌కు చెందిన నిర్మలా దేవి (చేతి వృత్తుల్లో)
  • అసోంకు చెందిన జోయ్నచరణ్ బతారీ (థింసాలో)
  • గుజరాత్‌కు చెందిన సురేశ్‌ సోనీ (సామాజిక కార్యకర్త, వైద్యుడు)
  • ఉత్తరాఖండ్‌కు చెందిన రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)
  • ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పాండి రామ్‌ మాండవి (కళాకారుడు)
  • గోవాకు చెందిన లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు)
  • పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోకుల్‌ చంద్ర దాస్‌ (కళా రంగంలో)

PM Kisan 19th Installment : పీఎం కిషాన్ డబ్బులు పడాలంటే ఈ నెల 31లోగా ఇలా చేయండి.. లేదంటే.. 19వ విడత డబ్బులు రావు..!