PM Kisan 19th Installment : పీఎం కిషాన్ డబ్బులు పడాలంటే ఈ నెల 31లోగా ఇలా చేయండి.. లేదంటే.. 19వ విడత డబ్బులు రావు..!

PM Kisan 19th Installment : అతి త్వరలోనే పీఎం కిషాన్ డబ్బులు విడుదల కానున్నాయి. ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, పీఎం కిషాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో పంపిణీ చేస్తారని భావిస్తున్నారు.

PM Kisan 19th Installment : పీఎం కిషాన్ డబ్బులు పడాలంటే ఈ నెల 31లోగా ఇలా చేయండి.. లేదంటే.. 19వ విడత డబ్బులు రావు..!

PM Kisan 19th Installment

Updated On : January 25, 2025 / 7:34 PM IST

Pm Kisan 19th Installment : పీఎం కిషాన్ లబ్దిదారులకు అలర్ట్.. పీఎం కిషాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత వచ్చే ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. పీఎం కిషాన్ పథకాన్ని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొన్ని మినహాయింపులకు లోబడి, సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భూస్వాముల రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Republic Day Sale : భలే ఉంది భయ్యా ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై దిమ్మతిరిగే డీల్.. ఆఫర్ ఉండగానే కొనేసుకోండి!

ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6వేల చొప్పున 3 నెలల వాయిదాలలో ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు. ఈసారి పీఎం కిషాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 31వ తేదీగా పూర్తి చేయండి లేదంటే.. వచ్చే 19వ విడత డబ్బులు అకౌంట్లో పడవు.. ఇంతకీ పీఎం కిషాన్ రిజిస్ట్రేషన్, కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

18వ విడత డబ్బులు పడ్డాయి.. ఇక 19వ విడతపై ఆశలు :
పీఎం కిషాన్ లబ్దిదారులకు ఇప్పటివరకూ 18వ విడత డబ్బులు మాత్రమే అందాయి. గత అక్టోబర్ 5న డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా డబ్బులు జమ చేశారు. ఇప్పుడు కిసాన్ రైతులంతా 19వ విడత కిషాన్ డబ్బులు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో కిసాన్ యోజన డబ్బులను పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందే రైతులు తమ కేవైసీ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసి ఉండాలి.

పీఎం కిషాన్ డబ్బులను ఇలా చెక్ చేయొచ్చు :
పీఎం కిషాన్ యోజన స్కీమ్ కోసం రైతులందరూ రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, పీఎం కిషాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల (జనవరి) 31 లోగా పూర్తి చేసుకోని ఉండాలి. పీఎం కిసాన్‌ యోజనకు సంబంధించి స్టేటస్ కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. పీఎం కిషాన్ లబ్ధిదారులు (pmkisan.gov.in) ద్వారా నేరుగా స్టేటస్ గురించి చెక్ చేసుకోవచ్చు.

Read Also : Motorola Razr 50 Ultra : ఈ మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫోన్ కొంటే మోటో బడ్స్ ఫ్రీ.. బ్యాంకు ఆఫర్లు కూడా..!

మీరు చేయాల్సిందిల్లా.. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయడమే.. ఆపై మీకు అక్కడ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆపై ‘Data’ బటన్‌పై క్లిక్ చేస్తే సరి.. మీకు స్క్రీన్‌పై మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్ ఈజీగా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు.

కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారా? :
పీఎం కిషాన్ సమ్మాన్ నిధి యోజన కేవైసీ (KYC) ప్రక్రియను లబ్ధిదారులు ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC) విజిట్ చేసి సులభంగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా, బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ సైతం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ అగ్రికల్చర్ ల్యాండ్ వివరాలను పొందుపరచాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా డబ్బులు జమ అవుతాయి.

అయితే, దీనికి సంబంధించి అన్ని రికార్డులను దగ్గర ఉంచుకోవాలని గుర్తించుకోండి. వచ్చే ఫిబ్రవరి బడ్జెట్‌లో పీఎం కిషాన్ డబ్బులు రూ.10 వేలకు పెంచే అవకాశం ఉందని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అదేగానీ నిజమైతే.. ఇకపై లబ్ధిదారు రైతుకు ప్రతి ఏడాదిలో రూ.6వేలకు బదులుగా రూ.10వేల సాయాన్ని రైతులు అందుకోవచ్చు.

పీఎమ్ కిషాన్ సమ్మాన్ నిధి 19వ విడత : లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

  • పీఎం కిషాన్ (PM KISAN) అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) పోర్టల్‌ని సందర్శించండి
  • మీరు పేమెంట్ సక్సెస్ ట్యాబ్‌లో భారత్ మ్యాప్‌ని చూడవచ్చు.
  • కుడి వైపున, “Dashboard” అనే ఎల్లో కలర్ ట్యాబ్ ఉంటుంది.
  • డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి
  • క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు
  • విలేజ్ డ్యాష్‌బోర్డ్ ట్యాబ్‌లో మీ పూర్తి వివరాలను నింపాలి
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, పంచాయతీని ఎంచుకోండి
  • ఆపై (Show) బటన్‌పై క్లిక్ చేయండి
  • ఆ తర్వాత మీరు మీ వివరాలను ఎంచుకోవచ్చు
  • ‘Get Report’ బటన్ క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చూడవచ్చు.