Motorola Razr 50 Ultra : ఈ మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫోన్ కొంటే మోటో బడ్స్ ఫ్రీ.. బ్యాంకు ఆఫర్లు కూడా..!

Motorola Razr 50 Ultra Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా మడతబెట్టే ఫోన్‌‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. పరిమిత ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.. మళ్లీ ధర ఎప్పుడైనా పెరగొచ్చు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Motorola Razr 50 Ultra : ఈ మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫోన్ కొంటే మోటో బడ్స్ ఫ్రీ.. బ్యాంకు ఆఫర్లు కూడా..!

Motorola Razr 50 Ultra Price

Updated On : January 25, 2025 / 6:16 PM IST

Motorola Razr 50 Ultra Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఏదైనా సేల్ ఉన్నప్పుడే.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. రిపబ్లిక్ డే సేల్‌కు ముందే మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. గత ఏడాదిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ మడతబెట్టే ఫోన్ ఫోన్ కంపెనీ క్లామ్‌షెల్-శైలి ఫోల్డబుల్ ఫోన్..

Read Also : Croma Republic Day Sale : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 సగం ధరకే కొనేసుకోండి.. ఈ డోల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ప్రస్తుతం రిపబ్లిక్ డేకి ముందు సేల్స్ ప్రమోషన్‌లో భాగంగా అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ. 99,999 ఉండగా, తాజా తగ్గింపుతో కేవలం రూ. 79,999కే ఆఫర్ చేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్‌తో పాటు 50ఎంపీ డ్యూయల్ ఔటర్ కెమెరా సెటప్, 32ఎంపీ ఇంటర్నల్ కెమెరాను కూడా కలిగి ఉంది.

డిజిటల్ స్టోర్లలో తగ్గింపు ధర ఎంతంటే? :
ఆసక్తిగల వినియోగదారులు మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ల ద్వారా రూ.69,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. జనవరి 26న రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ మోటో బడ్స్+తో వస్తుంది.

అదనపు ఖర్చు లేకుండా ఈ డివైజ్ ధర రూ. 6,999కు అందుబాటులో ఉంది. మిడ్‌నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ కలర్‌వేస్‌లో విక్రయించనుంది. ప్రస్తుత సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బాబ్‌కార్డ్, ఫెడరల్ బ్యాంక్ కార్డ్‌లను కూడా ఉపయోగించుకుని రూ. 2,500 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా తగ్గింపు ధరతో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 67,499కి కొనుగోలు చేయొచ్చు.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ భారత మార్కెట్లో 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో పాటు స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో జూలై 2024లో లాంచ్ అయింది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,640 పిక్సెల్‌లు) ఎల్టీపీఓ పోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లేను, అలాగే (1,080×1,272 పిక్సెల్‌లు) ఎల్టీపీఓ పోల్డ్ ప్యానెల్ కలిగిన 165Hz రిఫ్రెష్ రేట్, 4-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Read Also : Republic Day Sale : భలే ఉంది భయ్యా ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై దిమ్మతిరిగే డీల్.. ఆఫర్ ఉండగానే కొనేసుకోండి!

మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో రెండో 50ఎంపీ టెలిఫోటో కెమెరాను పొందవచ్చు. ఫోల్డబుల్ వెలుపల కెమరాలు కనిపిస్తాయి. లోపల 32ఎంపీ కెమెరా కూడా ఉంది. అది ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌‌సీ కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో అమర్చబడి ఉంటాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. నీటి నిరోధకతకు స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్8 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.