Bihar: గుడిలోకి వెళ్లిన ముస్లిం మంత్రి.. సీఎంపై బీజేపీ ఆగ్రహం

ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని, అయినప్పటికీ ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Bihar: ఒక ముస్లిం మంత్రి ఆలయంలోకి వెళ్లడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭ను టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల బోర్డు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ, గుడి నియమాలను అతిక్రమించి ముస్లిం వ్యక్తిని ఆలయంలోకి ఎలా తీసుకెళ్తారని నిప్పులు చెరిగింది. తాజాగా ఇది బిహార్ రాజకీయాలను కుదిపివేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. గయలో మంగళవారం అధికార పర్యటనకు వెళ్లిన నితీ‌ష్ కుమార్ తనతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరిని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు. అనంతరం మన్సూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

అయితే ఆ ఆలయంలోకి హిందూయేతరులు రాకూడదని బయట బోర్డు ఉన్నప్పటికీ ముస్లిం వ్యక్తిని నితీశ్ ఎలా తీసుకెళ్తారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని, అయినప్పటికీ ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

కాగా, బీజేపీ విమర్శలపై హిందుస్థాని అవామ్ మోర్చా మండిపడింది. బీజేపీ మతతత్వవాద వ్యాప్తి పూర్తిగా అభ్యంతరకరమని హెచ్ఏఎం జాతీయ ప్రతినిధి దినేష్ రిజ్వాన్ అన్నారు. సమాజంలో విషపూరిత వాతావరణాన్ని బీజేపీ నేతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వారి మతతత్వ ఎజెండా వ్యాప్తిని సాగనిచ్చేది లేదని ఆయన విమర్శలు గుప్పించారు.

Karnataka: భర్త హత్యకు ప్లాన్ చేసి ప్రియుడిని కోల్పోయింది.. చివరికి ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు