Karnataka: భర్త హత్యకు ప్లాన్ చేసి ప్రియుడిని కోల్పోయింది.. చివరికి ఏమైందంటే?

నవీన్‌ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్‌ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్‌, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చేసిన పోలీసులకు అతడు చెప్పిందంతా నిజమేనని అర్థమైంది. నవీన్‌ హత్య ప్లాన్‌ వెనుక అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ హస్తం కూడా ఉన్నట్టు తేలింది.

Karnataka: భర్త హత్యకు ప్లాన్ చేసి ప్రియుడిని కోల్పోయింది.. చివరికి ఏమైందంటే?

Karnataka: ప్రియుడి మీద మోజుతో భర్తను కడతేర్చాలని ఒక మహిళ స్కెచ్ వేసింది. అన్ని పక్కాగా అనుకుని అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చింది. అనుకున్నట్లే అంతా జరిగినట్టు కనిపించినప్పటికీ చివరి నిమిషంలో ఆ కిరాయి హంతకుల మనసు కరిగి హత్యను విరమించుకుని బాధితుడికి నిజం చెప్పారు. అంతే ఆ తర్వాత రివర్స్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంతలోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త కళ్లెదరుయ్యాడు. షాక్ నుంచి తేరుకునే లోపే పోలీసులు వచ్చి ఇంతటి డ్రామాకు ఆద్యురాలైన సదరు మహిళను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఘటన ఇది.

బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్, అనుపల్లవి(26)లకు చాలా కాలం క్రితమే పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. నవీన్‌ పిండి మిల్లు, క్యాబ్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాలక్రమంలో అనుపల్లవికి హిమవంత్‌ కుమార్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. వారి పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. అతడిపై ప్రేమతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది అనుపల్లవి. దీనికి హిమవంత్ కూడా సహకరించాడు.

ఇద్దరూ కలిసి కిరాయి హంతకులను మాట్లాడారు. 2 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.90 వేలు వారికి ముట్టజెప్పారు. నవీన్‌ ఫొటో, అతడి క్యాబ్‌ వివరాలు అందజేశారు. ప్లాన్‌ ప్రకారం జూలై 23న తమిళనాడుకు తీసుకెళ్లాలంటూ నవీన్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు కిరాయి హంతకులు. తొలుత ఇద్దరు అతడి కారులో ఎక్కారు మార్గమధ్యంలో మూడోవాడు కూడా ఆ కారులో ఎక్కాడు. మార్గమధ్యంలో వారు అతణ్ని కిడ్నాప్‌ అయితే చేశారు కానీ, చంపడానికి ధైర్యం సరిపోక అసలు విషయం అతడికి చెప్పేశారు.

Karnataka: బీజేపీ మంట పెడితే కాంగ్రెస్ పెట్రోల్ పోస్తోంది: సావర్కర్ అంశంపై మాజీ సీఎం

అలా కాసేపు మాట్లాడుకుంటుంగా కిరాయి హంతకులకు నవీన్ కుమార్‭కు మధ్య స్నేహం కుదిరింది. ఆ సంతోషంలో నలుగురూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఈ ఆనందంలో ఉండగానే అనుపల్లవి వారికి ఫోన్‌ చేసి పని పూర్తయిందా అని అడిగింది. పూర్తైందని వారు చెప్పగానే ఆధారాలు చూపాలని అడిగింది. దీంతో నవీన్‌ ఒంటిపై కెచప్‌ పోసి, ఫొటోలు తీసి ఆమెకు పంపారు. పని పూర్తైందని ఆమె మిగతా డబ్బు (రూ.1.1 లక్షలు) వారికి పంపింది. కానీ ఆ ఫొటోలు చూసేసరికి అనుపల్లవి ప్రియుడు హిమవంత్‌ విపరీతమైన భయానికి గురయ్యాడు. పోలీసులకు దొరికిపోతామన్న భయమో.. పరువుపోతుందనో.. కారణమేదైనాగానీ ఆగస్టు 1న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఇక మరోవైపు నవీన్‌ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్‌ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్‌, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చేసిన పోలీసులకు అతడు చెప్పిందంతా నిజమేనని అర్థమైంది. నవీన్‌ హత్య ప్లాన్‌ వెనుక అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ హస్తం కూడా ఉన్నట్టు తేలింది. వారిని ప్రశ్నించగా నవీన్‌ను హత్య చేయడానికి నియమించుకున్న హరీశ్‌, నాగరాజు, ముగిలన్‌ పేర్లు బయటపడ్డాయి. ఇంత జరిగినప్పటికీ తన భార్య అంటే తనకు ఇష్టమేనని, ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను వేడుకున్నాడు నవీన్. అయితే చట్టం ప్రకారం తాము చేయాల్సింది చేయాలని అనుపల్లవిని అరెస్ట్ చేశారు.

కుక్కలు వెంటపడుతుంటాయి.. రైతు సంఘం నేతలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు