నిఘా వర్గాల హెచ్చరికలు: ఢిల్లీలో హై అలర్ట్

  • Publish Date - February 25, 2020 / 03:21 AM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీ పర్యటన ఇవాళ(25 ఫిబ్రవరి 2020) జరగనుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలతో ఢిల్లీలో పోలీసులు రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. సోమవారం పౌరసత్వ సవరణ చట్టానికి( సీఏఏ) వ్యతిరేకంగా అల్లర్లు జరగగా.. ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీలో జరిగిన అల్లర్లు నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ రాజ్ ఘాట్‌కు వెళ్లే మార్గంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారులు, స్పెషల్ సెల్ ఆఫీసర్స్ అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులతో దీనిని సమీక్షించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతోపాటు మరో మూడు సంస్థల పాత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

See Also>>ఢిల్లీలో సీఏఏ హింస….కపిల్ మిశ్రా స్పీచ్ పై గంభీర్ అభ్యంతరం

ఢిల్లీలో జరిగిన ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ పర్యటనకు అదనపు పోలీసు బలగాలను మోహరించింది పోలీసు శాఖ. ఢిల్లీ అల్లర్లపై ప్రత్యేక నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు