Indian Army: పాకిస్తాన్ లో కొత్త ప్రధాని: ఎల్ఓసీ వద్ద భద్రతను సమీక్షించిన భారత ఆర్మీ కమాండర్

కాశ్మీర్ లోయను సందర్శించిన నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటనలో భాగంగా సోమవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు

Indian Army: పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పాకిస్తాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ లో శరవేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి ముప్పు లేకపోయినా..కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్..చైనాతో వ్యవహరించే విధానంపై భారత్ చర్యలు ఉండనున్నాయి. ఇదిలాఉంటే..పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు మారినవేళ..భారత ఆర్మీ కమాండర్ సరిహద్దు వెంట పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కాశ్మీర్ లోయను సందర్శించిన నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, పర్యటనలో భాగంగా సోమవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దులోని ఫార్వర్డ్ ప్రదేశాలకు వెళ్లిన ఆయన ఫార్మేషన్ లు మరియు యూనిట్ లను సందర్శించారు.

Also read:Covid-19 compensation: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు

లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే, GOC చినార్ దళం, స్థానిక కమాండర్లు వెంటరాగా..ప్రస్తుతం ఎల్వోసీ వెంట భద్రత పరిస్థితి గురించి, శత్రువులను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రణాళికల గురించి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి వివరించారు. నియంత్రణ రేఖపై కొనసాగుతున్న కాల్పుల విరమణ, ఇతర అభివృద్ధి పనులు, కౌంటర్ చొరబాటు గ్రిడ్ మరియు కార్యాచరణ సంసిద్ధత గురించి స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. స్థానిక కమాండర్లతో సమావేశం సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ కాల్పుల విరమణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

Also read:Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

అదే సమయంలో శత్రువుల చొరబాటును అడ్డుకోవడంలో భద్రత సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యహరించాల్సి ఉంటుందని లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సూచించారు. శత్రు చొరబాటులను అడ్డుకునే సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి భద్రత సిబ్బంది, ఫార్మేషన్ ల ద్వారా ఏర్పాటు చేయబడ్డ చర్యలు మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లను ఆయన ప్రశంసించారు. ఫార్వర్డ్ ప్రాంతాల గ్రామస్తులతో సంభాషించిన ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వారిలో సానుకూల దృక్పథం, అధిక ప్రేరణ మరియు బలమైన జాతీయ స్ఫూర్తి వ్యక్తమవడంపై అభినందించారు.

Also read:Ukraine Child letter: ‘అమ్మా నువ్వు చెప్పినట్లుగా మంచి అమ్మాయిగా ఉంటా..నిన్ను స్వర్గంలో కలుసుకుంటా..’

ట్రెండింగ్ వార్తలు