Ukraine Child letter: ‘అమ్మా నువ్వు చెప్పినట్లుగా మంచి అమ్మాయిగా ఉంటా..నిన్ను స్వర్గంలో కలుసుకుంటా..’

‘అమ్మా నువ్వు చెప్పినట్లుగా మంచి అమ్మాయిగా ఉంటా..నిన్ను స్వర్గంలో కలుసుకుంటా..’అంటూ రష్యా దాడిలో చనిపోయిన తల్లికి తొమ్మిదేళ్ల చిన్నారి రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.

Ukraine Child letter: ‘అమ్మా నువ్వు చెప్పినట్లుగా మంచి అమ్మాయిగా ఉంటా..నిన్ను స్వర్గంలో కలుసుకుంటా..’

‘we Will Meet In Heaven’

Ukraine 9 Years old  Child heartbreaking letter : చిన్నపిల్లలు అమ్మానాన్నలకు రాసిన లేఖలు చాలా చాలా అపురూపంగా ఉంటాయి. కానీ ఓ చిన్నారి చనిపోయిన తల్లికి రాసిన ఓ లేఖ అందరి హృదయాలను కదిలించివేస్తోంది. ‘అమ్మా నిన్ను స్వర్గంలోనే కలుసుకుంటా..నువ్వు చెప్పినట్లుగానే మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటా’అంటూ రాసిన లేఖ ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మనస్సుల్ని కదిలిస్తోంది. రష్యా యుక్రెయిన్ పై సాగించే యుద్ధంలో ఇటువంటి వేదనలు..ఆవేదనలు..ఆక్రోశాలు ఎన్నో..ఎన్నెన్నో. యుక్రె్యిన్ లో ఎవరిని కదిలించినా ఎన్నో విషాధ గాధలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి ఆవేదనల్లో 9 ఏళ్ల చిన్నారి రష్యా చేస్తున్న బాంబుల దాడిలో చనిపోయిన తల్లికి రాసిన ఓ లేఖ ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది.

Also read : Boris Johnson : కీవ్ వీధుల్లో బ్రిటన్ ప్రధాని ప్రత్యక్షం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి..

రష్యా సైన్యం భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితులు వర్ణనాతీతంగా ఉన్నాయి. బుచా వంటి నగరాల్లో నగరాల్లో రష్యా సైనికులు ఆకృత్యాలు యావత్‌ ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సేనలు చేస్తున్న దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోతున్న చిన్నారులు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. బొరొడియెంక నగరంలో రష్యా దాడిలో చనిపోయిన తల్లిని తలచుకుని 9 ఏళ్ల చిన్నారి భావోద్వేగంతో రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. ఈ లేఖలో చిన్నారి ‘అమ్మ చెప్పినట్లుగా ఓ మంచి అమ్మాయిగా పేరుతెచ్చుకుంటా..నిన్ను మళ్లీ స్వర్గంలో కలుసుకోవచ్చంటూ రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.

‘అమ్మా.. మార్చి 8న రాస్తున్న ఈ లేఖ నీకు అంకితం. తొమ్మిదేళ్లు నా జీవితంలో మరచిపోలేని రోజులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా బాల్యంలో నీవు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞురాలిని. ప్రపంచంలో చాలా చాలా గొప్ప అమ్మవు నీవే. నిన్నెప్పటికీ మరచిపోను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీవు స్వర్గానికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. మళ్లీ మనం స్వర్గంలో కలుద్దాం. నేను కూడా స్వర్గానికి రావడానికి మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటా. అందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. కిస్‌ యూ అమ్మా..’ అంటూ తొమ్మిదేళ్ల చిన్నారి తన డైరీలో రాసుకుంది. ఈ చిన్నారి రాసుకున్న లేఖను ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారుడు ఆంటోన్‌ గెరషెంకో ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Also read : Australia PM: ప్రధాని మోదీకి ఇష్టమైన కిచిడీ వండి ఫోటో పంపించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్

కాగా..ఉక్రెయిన్‌లో సామాన్యులపై రష్యా సేనలు చేస్తోన్న దాడులకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.దీంట్లో భాగంగానే బొరొడియెంక నగరంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ కుటుంబంపై రష్యా సేనలు దాడి జరిపాయి. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆమెను గుర్తు చేసుకుంటూ తొమ్మిదేళ్ల కూతురు గలియా తన డైరీలో రాసుకున్న లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.