Australia PM: ప్రధాని మోదీకి ఇష్టమైన కిచిడీ వండి ఫోటో పంపించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్
ఆస్ట్రేలియాలో కర్రీ నైట్ గా జరుపుకునే రాత్రి విందు పురస్కరించుకుని..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్ లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీ వంటకాన్ని తమ ఇంటిలో వండినట్టు

Australia
Australia PM: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్..భారత్, ప్రధాని మోదీ పై తన అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇటీవల భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA)ను పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ శనివారం వ్యక్తిగతంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన వంటకం “కిచిడీని” తయారు చేస్తున్న ఫొటోను మోరీసన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో కర్రీ నైట్ గా జరుపుకునే రాత్రి విందు పురస్కరించుకుని..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్ లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీ వంటకాన్ని తమ ఇంటిలో వండినట్టు ఆస్ట్రేలియా ప్రధాని మోరీసన్ చెప్పుకొచ్చారు. ఈమేరకు తాము వండిన వంటకాల ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు మోరీసన్.
Also read:Rahul gandhi : మాయావతికి సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేశాం.. సీబీఐ, ఈడీ భయంతో…
“భారతదేశంతో మా కొత్త వాణిజ్య ఒప్పందాన్ని జరుపుకోవడానికి, ఈ రాత్రి కర్రీ నైట్ కోసం నేను వండిన కూరలన్నీ నా ప్రియమైన స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క గుజరాత్ ప్రావిన్స్ నుండి, అతని అభిమాన కిచిడీ సిద్ధం చేశాము. జెన్(స్కాట్ భార్య), అమ్మాయిలు(ఆయన పిల్లలు) మరియు అమ్మ(మోరీసన్ తల్లి) అందరూ వంటకాన్ని ఆమోదించారు” అంటూ ప్రధాని మోరీసన్ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. మొదటి ఫోటోలో, ఆస్ట్రేలియా ప్రధాని బ్యాక్ గ్రౌండ్ లో స్టవ్ మీద ‘కిచిడీ’ వండిన ఫోటో, రెండవ చిత్రం కర్రీ నైట్ కోసం వండిన వంటకాల ఫోటోను పోస్ట్ చేశారు.
ఒక అభివృద్ధి చెందిన దేశంతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం దశాబ్ద కాలం తరువాత ఇదే మొదటిసారి. ఈసిటిఎ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని అందిస్తుందని ఇరుదేశాధినేతలు ప్రకటించారు. ఆస్ట్రేలియా భారతదేశం యొక్క 17వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మరియు భారతదేశం ఆస్ట్రేలియా యొక్క 9 వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2021లో ఇరుదేశాల మధ్య 27.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 45 నుంచి 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేస్తుందని అంచనా. సరికొత్త వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని మరియు రెండు దేశాల్లో సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నారు.
View this post on Instagram
Also read:Sri Lanka Crisis : 6 నెలల్లో 3 బిలియన్ డాలర్లు అవసరం