Nitin Patel : సీఎం పదవి మళ్లీ చేజారింది.. బాధగా లేదని కన్నీళ్లుపెట్టిన నితిన్ పటేల్!

తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర ప‌టేల్‌కు సీఎం పదవికి ఎంపిక చేయడంతో డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. లోలోపల బాధగా ఉన్నా పైకి బాధ లేదని కంటతడిపెట్టారు.

Not Upset, Bjp Given Me A Lot Nitin Patel Gets Teary Eyed After Missing Gujarat Cm Berth

Gujarat CM berth Nitin Patel : గుజ‌రాత్‌ రాష్ట్రంలో సీఎం విజయ్ రూపానీ రాజీనామాతో అనూహ్య ప‌రిణామాలు చేసుకున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే భూపేంద్ర ప‌టేల్‌కు సీఎం పదవికి ఎంపిక చేయడం ఈ క్ర‌మంలో ఆ ప‌ద‌వి ఆశించిన డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. రూపానీ రాజీనామా త‌ర్వాత సీఎం రేసులో ముందు వ‌రుస‌లోఉన్న‌ది నితిన్ ప‌టేలే.. ఈసారైన తనకు సీఎం పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం భూపేంద్ర‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తనను కాదని కొత్తగా ఎమ్మెల్యే అయినా భూపేంద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కాస్తా నితిన్ పటేల్ ను బాధించింది.
Bhupendra Patel Oath : గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్

లోలోపల బాధగా అనిపించినా పైకి బాధ లేదంటూ కంటతడి బెట్టారు. సోమవారం మధ్యాహ్నం భూపేంద్ర రాజ్ భవన్‌లో గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తనను భూపేంద్ర ఇంటికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తాను నితిన్ పటేల్ మాట్లాడుతూ.. త‌న కోసం పార్టీ ఎంతో చేసింద‌న్నారు. ప‌ద‌వి రానందుకు అసంతృప్తిగా లేదని అన్నారు.

భూపేంద్ర తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. దాంతో ఇంటికి వెళ్లిన నితిన్ భూపేంద్రకు శుభాకాంక్ష‌లు తెలిపారు. భూపేంద్ర సీఎంగా ప్ర‌మాణం చేయ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఎప్పుడు అవ‌స‌రం అయినా నా గైడెన్స్ కావాల‌ని ఆయ‌న అడిగారని చెప్పారు. తానేమి అసంతృప్తిగా లేనని, 18 ఏళ్ల వ‌య‌సు నుంచి బీజేపీతో కలిసి ప‌ని చేస్తున్నానన్నారు. ఇకపై కూడా ఇలానే పార్టీలో కొన‌సాగుతానని, పార్టీలో నాకు ఓ స్థాయి వ‌చ్చినా రాక‌పోయినా సేవ చేస్తాను అని నితిన్ ప‌టేల్ స్పష్టం చేశారు.
Gujarat CM : ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అలా సీఎం పదవి పట్టేసి..రేపే భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం