నవంబరు, డిసెంబర్లో ఎండలు పెరగనున్నాయ్

దాదాపు అక్టోబరు ముగిసిందంటే చలికాలం మొదలైనట్లే. నవంబరు, డిసెంబర్లో భారత్‌లో ఉండే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఎండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) దక్షిణాసియాలోని వాతావరణ పరిస్థితులపై రిపోర్టు ఇచ్చింది. 

2020సంవత్సరం శీతాకాలంలో చలి ప్రభావం తక్కువే ఉంటుంది. జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో గానీ చలి మొదలవుతుంది. ఆగష్టు నెలలో వాతావరణ పరిస్థితులను బట్టి 70 నుంచి 100 శాతం వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. 

జమ్మూ కశ్మీర్లో మాత్రం ఉష్ణోగ్రతలో మార్పులపై ప్రభావం తక్కువగానే ఉంది. మిగిలిన ప్రాంతాల కంటే 50 నుంచి 60శాతం మాత్రమే ఉష్ణోగ్రత పెరుగుతుందని లేదా సాధారణ స్థాయిలోనే ఉండనుందని ఐఎండీ తెలిపింది. 

ట్రెండింగ్ వార్తలు