Vaccination Certificate : వాట్సాప్​లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్..సెకన్లలోనే పొందండి ఇలా

కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు వాట్సాప్​ ద్వారా కూడా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను పొందవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Vaccination Certificate కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు వాట్సాప్​ ద్వారా కూడా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను పొందవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అనేక రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ప్రయాణం కోసం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ల కోసం పట్టుబడుతున్న సమయంలో మరియు అనేక సంస్థలు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారికే ఆతిథ్యం ఇస్తున్న సమయంలో ప్రభుత్వం వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేలా కీలక నిర్ణయం తీసుకుంది.

అనేక సందర్భాల్లో అవాంతరాలు ఎదుర్కొన్న కోవిన్ టీకా పోర్టల్ నుండి సర్టిఫికేట్‌లను పొందడానికి వాట్సాప్ ఎంపిక ఇప్పుడు ప్రజలకు సులభమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. పౌరులు మూడు సులభమైన దశలలో వాట్సాప్ ​లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి కార్యాలయం ఇవాళ ట్విట్టర్ లో తెలిపింది. మై గవర్నమెంట్ కరోనా హెల్ప్‌డెస్క్ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందటం ఎలా

మొదట ‎+91 9013151515 నెంబర్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి
తర్వాత ‎వాట్సాప్​లో ‘covid certificate’ టైప్ చేసి పంపండి‎
ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే..కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీరు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ని పొందుతారు.

ట్రెండింగ్ వార్తలు