Nuh Violence : నుహ్ అల్లర్ల ఎఫెక్ట్..ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు

హర్యానా మత ఘర్షణల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ వేటు వేశారు. హర్యానాలోని నుహ్‌లో మత ఘర్షణలు చెలరేగి ఆరుగురు మృతి చెందిన కొద్ది రోజుల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ అయ్యారు....

Nuh Violence : హర్యానా మత ఘర్షణల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ వేటు వేశారు. హర్యానాలోని నుహ్‌లో మత ఘర్షణలు చెలరేగి ఆరుగురు మృతి చెందిన కొద్ది రోజుల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ అయ్యారు. వీహెచ్‌పీ ర్యాలీలో ఘర్షణలు జరిగిన రోజు వరుణ్ సింగ్ సెలవులో ఉన్నారు.

Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు

వరుణ్ సింగ్లా ఇప్పుడు భివానీకి బదిలీ అయ్యారు. (Nuh top cop transferred) మత ఘర్షణలు చెలరేగిన రోజు వరుణ్ సింగ్లా సెలవులో ఉన్నారు, పాల్వాల్ ఎస్పీ లోకేంద్ర సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐపిఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా ఇప్పుడు సింగ్లా స్థానంలో నుహ్ ఎస్పీగా నియమితులయ్యారు. నూహ్‌లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపుతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి.

Gyanvapi Survey Breaking: జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

ఈ సంఘటన గురుగ్రామ్, సోహ్నా,ఇతర ప్రాంతాల్లో మతపరమైన చిచ్చును రాజేసింది. ఈ ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందగా, వివిధ దుకాణాలు, సంస్థలను ఆందోళనకారులు దహనం చేశారు. గత రెండు రోజులుగా పలు దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు