Gyanvapi Survey Breaking: జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

భారీ భద్రత మధ్య జ్ఞానవాపి మసీదులో శుక్రవారం సర్వే ప్రారంభం అయింది. అలహాబాద్ హైకోర్టు ఆమోదం మేరకు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శుక్రవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది....

Gyanvapi Survey Breaking: జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

Gyanvapi mosque

Gyanvapi Survey Breaking: భారీ భద్రత మధ్య జ్ఞానవాపి మసీదులో శుక్రవారం సర్వే ప్రారంభం అయింది. అలహాబాద్ హైకోర్టు ఆమోదం మేరకు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శుక్రవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. (Survey begins at Gyanvapi premises) కట్టుదిట్టమైన భద్రతతో సాగుతున్న సర్వే ప్రక్రియలో ముస్లిం పక్షం గైర్హాజరైంది.

Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు

17వ శతాబ్దపు మసీదు హిందూ దేవాలయం యొక్క పూర్వ నిర్మాణంపై నిర్మించారా లేదా అనేది నిర్ధారించడానికి ఉద్ధేశించిన సర్వేను నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని అనుమతించిన ఒక రోజు తర్వాత ఈ సర్వే ప్రారంభం అయింది. (amid tight security) ఏఎస్‌ఐ సర్వే ప్రారంభమైనప్పుడు జిల్లా యంత్రాంగం నియమించిన వ్యక్తులు మాత్రమే ప్రాంగణంలో ఉన్నారు. కాగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు సర్వేను బహిష్కరించారు. (Gyanvapi mosque)

US Navy Men : చైనాకు రహస్య సమాచారం అందించిన యూఎస్ నేవీ సిబ్బంది..అరెస్ట్

మునుపటి సర్వేలో శివుడు, పార్వతి శిల్పాలతో సహా అనేక కళాఖండాలు, వరాహ (విష్ణువు యొక్క పంది అవతారం), గంటలు, త్రిశూలాలు,పలు ఇతర ఆధారాలు ప్రాంగణం లోపల కనుగొన్నామని మసీదు ఒక దేవాలయం అని సూచిస్తుందని హిందూ పక్షం నుంచి సోహన్‌లాల్ ఆర్య చెప్పారు. ముస్లిం పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ ఉత్తర్వు వచ్చింది.

Mexico : మెక్సికోలో లోయలో పడిన బస్సు…17 మంది మృతి,22 మందికి గాయాలు

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్న బీజేపీ నేతలు, మసీదు స్థలంలో ఉన్న ఆలయానికి సంబంధించిన నిజాలు ఇప్పుడు బయటకు వస్తాయన్నారు. ‘‘ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు మంచిది. భారతీయులమైన మాకు ఇది ఆశను కలిగించేది. నిజం ఎప్పుడూ బయటకు వస్తుంది, సమయం పడుతుంది, కానీ నిజం బయటకు వస్తుంది’’ అని బీజేపీ ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పార్లమెంటు వెలుపల వ్యాఖ్యానించారు.