కరోనాతో ప్రపంచం అంతా భయం గుప్పట్లో బతుకుతుంది. ఇటువంటి సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది దేవుళ్లలా సాయం చేస్తూ కరోనా నుంచి కాపాడేందుకు పని చేస్తున్నారు. అయితే వారి పనికి కూడా కొందరు ఆటంకాలు కలిగిస్తున్నారు. డాక్టర్లపై దాడి చెయ్యడం.. నర్సులతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులతో ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
లేటెస్ట్‌గా ఢిల్లీలోని మత సమావేశానికి హాజరై కరోనా వైరస్ లక్షణాలతో ఐసోలేషన్‌లో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నీచంగా ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కరోనా సోకిందనే బాధ లేకుండా వైద్యసేవలు అందించే నర్సులపై లైంగిక వేధింపులకు దిగుతున్నారు.
తమ హాస్పిటల్‌లోని ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఐసోలేషన్ వార్డులో అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు అయ్యాయి.(కరోనా భూతం : ఇండియా 2069 కేసులు..53 మంది మృతి)
తమకు సిగరెట్లు, బీడీలు కావాలని ఆరుగురు రోగులు డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని, ఘటనపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు