రాహుల్ పై ఒబామా సెటైర్లు

  • Publish Date - November 13, 2020 / 10:05 AM IST

Obama mentions Congress leader Rahul Gandhi : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై ఒబామా సెటైర్లు విసిరారు. ఒబామా కొత్త పుస్తకంలో మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలను ప్రస్తావించారు. తన కొత్త పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఏమనుకుంటున్నాననేది వివరిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాహుల్‌పై తన బుక్‌లో సెటైరికల్‌గా రాశారు.



రాహుల్ గాంధీకి తన గురించి తనకే తెలీదని.. అతనికి ఆ గుణం ఉందంటూ స్టార్ట్‌ చేశారు. రాహుల్‌ కోర్సు చేసే విద్యార్థిలా ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవటానికి ఉత్సాహంగా ఉంటాడని.. కాని సబ్జెక్ట్‌లో లోతుగా వెళ్లే విషయం రాహుల్‌లో లేదన్నారు. విషయం నేర్చుకోవాలనే అభిరుచి రాహుల్‌లో లేదన్నారు ఒబామా.



గతంలో అనేక పుస్తకాలను రచించిన ఒబామా.. ఇప్పుడు తన కొత్త పుస్తకంలో రాహుల్ ప్రస్తావన తీయడం ఆసక్తిగా మారింది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఒబామా.. మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేరళ వయనాడ్ నుంచి సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ గురించి తాను ఏమనుకుంటున్నానో చెబుతానంటూ బుక్‌లో రాయడం చర్చనీయాంశంగా మారింది.