×
Ad

October Long Weekend : అక్టోబర్‌ లాంగ్ వీకెండ్ గైడ్.. ఈ హాలీడేస్‌కు ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. ఈ ప్రాంతాలకు వెళ్తే ఫుల్లుగా చిల్ అవ్వొచ్చు..!

October Long Weekend Guide : అక్టోబర్‌లో లాంగ్ వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? పండగ సెలవులకు ఈ ప్రాంతాలకు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.

October Long Weekend Guide

October Long Weekend Guide : అక్టోబర్ అంటేనే పండుగ నెల.. అంతా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకవైపు స్కూళ్లకు సెలవులు.. మరోవైపు ప్రభుత్వ సెలవులతో నెల మొత్తంలో సగానికి పైగా రోజులు సెలవులే ఉన్నాయి. ఈ సెలవుల్లో ఇంటి దగ్గర ఉండటం కన్నా ఎక్కడికైనా వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుందా? అయితే, ఈ అక్టోబర్ లాంగ్ వీకెండ్ గైడ్ మీకోసమే.. ఈ నెలలో వరుస సెలవులు వచ్చాయి. నవరాత్రి, దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగలు ఈ నెలలో ఉన్నాయి.

ముందుగా అక్టోబర్‌లో గాంధీ జయంతితో (October Long Weekend Guide) మొదలై నెలాఖరు వరకు అనేక సెలవులు ఉన్నాయి. ఈ నెలలో పండగ సెలవులతో పాటు జాతీయ సెలవులు కూడా ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో కలిసి వీకెండ్ టూర్ వెళ్లాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ నెలలో ఎన్ని సెలవులు? ఎన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి.. ఏయే రోజుల్లో ఎక్కడికి వెళ్తే ఫుల్‌గా చిల్ అవ్వొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అక్టోబర్ నెలలో మొత్తం సెలవులివే :

  • అక్టోబర్ 1 : మహానవమి
  • అక్టోబర్ 2 : గాంధీ జయంతి
  • అక్టోబర్ 7 : మహర్షి వాల్మీకి జయంతి, శరద్ పూర్ణిమ
  • అక్టోబర్ 10 : కర్వా చౌత్
  • అక్టోబర్ 20 : నరక్ చతుర్దశి, కాళీ పూజ
  • అక్టోబర్ 21 : దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)
  • అక్టోబర్ 22 : గోవర్ధన్ పూజ
  • అక్టోబర్ 23 : చిత్రగుప్త జయంతి
  • అక్టోబర్ 27-28 : ఛట్ పూజ

అక్టోబర్ 2025 లాంగ్ వీకెండ్ ప్లాన్ :

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతికి సెలవు. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం సెలవు తీసుకుంటే.. అక్టోబర్ 4, 5 తేదీలలో మీకు శనివారం, ఆదివారం సెలవులు కలిసి వస్తాయి. దాంతో మొత్తం 4 రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్టోబర్ 4, 5 తేదీలలో శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. 18, 19 తేదీలలో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 20 నుంచి 22 వరకు దీపావళి సెలవులు ఉంటాయి. మీకు వరుసగా 5 రోజులు సెలవులు లభిస్తాయి. అక్టోబర్ 23, 24 తేదీలలో కూడా మీరు సెలవు తీసుకుంటే.. మరో వీకెండ్ హాలీడే కూడా ఉంటుంది.

ఏయే రోజుల్లో టూర్ ప్లాన్ చేయాలంటే? :
మీరు అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. మీ ఫస్ట్ లాంగ్ వీకెండ్ గాంధీ జయంతి తర్వాత మొదలవుతుంది. మీరు ముస్సోరీ, నైనిటాల్, మనాలి వంటి ఉత్తర భారతీయ ప్రాంతాల్లోని హిల్ స్టేషన్‌లను సందర్శించవచ్చు.4 రోజుల నుంచి 5 రోజుల లాంగ్ వీకెండ్‌ను గడపవచ్చు. కర్వా చౌత్ 10వ తేదీన వీకెండ్.. అక్టోబర్ 11, 12వ తేదీలలో ఉంటుంది. కపుల్స్, ప్రేమికులు ఎవరైనా సరే కర్వా చౌత్ సెలవు సందర్భంగా 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

మీరు ఎడారి సఫారీ లేదా రాజస్థాన్ లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లవచ్చు. అక్టోబర్ చివరి వారం దీపావళి సెలవులు. ఈ సమయంలో కేరళ, హంపి, మధురై వంటి దక్షిణ భారత పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే.. ఈ సెలవుల్లో శ్రీలంక, నేపాల్, భూటాన్‌లను సందర్శించి రావొచ్చు.