‘హలో’ చెబుతున్న ఆక్టోపస్..!! : వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 07:33 AM IST
‘హలో’ చెబుతున్న ఆక్టోపస్..!! : వైరల్ వీడియో

Updated On : February 22, 2020 / 7:33 AM IST

భూమి మీద ఉన్నఅత్యంత తెలివైన జీవుల్లో ఆక్టోపస్ ఒకటని మరోసారి నిరూపితమైంది.  ఎనిమిది కాళ్లతో నడిచే ఈ ఆక్టోపస్ చాలా తెలివైనవని సైంటిస్టుల పరిశోధనల్లో కూడా నిరూపించబడింది. ఆక్టోపస్ తెలివితేటలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గాజు బాక్సులో ఉన్న ఓ ఆక్టోపస్ కు ఓ వ్యక్తి చేత్తో ‘హలో’ చెప్పాడు.దానికి అది బదులిస్తూ  ‘హలో’ చెప్పింది. నేచర్ ఈజ్ లిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూ గ్రహం మీద ఉండే అత్యంత తెలివైన వాటిలో ఆక్టోపస్ కూడా ఒకటి అని పోస్ట్ చేసింది. 

ఓ వ్యక్తి ఆక్టోపస్ కు హలో చెప్పాడు. దానిక అది బదులిస్తూ ‘హలో’ చెప్పింది. దానికి అతడు ఆనందిస్తూ చక్కగా నవ్వేశాడు. నేనస్సలు ఇది ఊహించలేదని విష్ చేస్తే ఎంత మర్యాదపూర్వకంగా తిరిగి విష్ చేసిందో అంటూ ఆనందం వ్యక్తంచేశాడు సదరువ్యక్తి. ఇది ఎక్కడ జరిగింది? విష్ చేసింది ఎవరు అనే విషయం పక్కన పెడితే.. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆక్టోపస్ ‘హాలో’కి ఫిదా అవుతున్నారు.