Dogs Attack : ఒడిశాలో స్కూటీని వెంబడించిన వీధి కుక్కలు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

వీధికుక్కలు దాడులకు తెగబడుతున్న వార్తలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఒడిశాలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్కూటర్‌పై వెళ్తున్న వారిని కూడా ఇవి వెంబడించి హడలెత్తిస్తున్నాయి. గాంధీనగర్‌లో జరిగిన ఓ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Dogs Attack : ఇటీవల కాలంలో వీధి కుక్కల (street dogs) సంచారం ఎక్కువ కావడం.. అవి మనుష్యులపై దాడి చేయడం.. పలువురు చిన్నారులు సైతం మృత్యువాత పడటం విన్నాం. తాజాగా ఒడిశాలో (Odisa) స్కూటర్ పై వెళ్తున్న వారిపై దాడి చేయడానికి వెంబడించిన వీధి కుక్కలు ప్రమాదానికి కారణం అయ్యాయి. కుక్కలు వెంబడించడంతో భయపడిన ఓ మహిళ ఆగి ఉన్నస్కూటర్‌తో కారుని ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విషాదం : సైనికుడిపై దాడి చేసి చంపేసిన ఆర్మీ డాగ్స్ 

బెర్హంపూర్ (berhampur) గాంధీనగర్ (gandhinagar) ప్రాంతంలో సుప్రియ అనే మహిళ తన సోదరి సుస్మిత, కుమారుడు సాయికిరణ్ తో కలిసి గుడికి (temple) స్కూటర్ పై (scooter) గుడికి వెళ్తోంది. బండిపై వెళ్తున్న వారిని అకస్మాత్తుగా కొన్ని కుక్కలు వెంబడించాయి. వాటిని చూసి బెదిరిపోయిన సుప్రియ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కింద పడ్డారు.  తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Stray Dogs Indian Soldiers : మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు .. ఆర్మీని అప్రమత్తం చేస్తున్న స్ట్రీట్ ఫ్రెండ్స్

బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (muncipal corporation) పరిధిలో రోజు రోజుకి వీధికుక్కల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే అక్కడి జనం వాటి నుంచి కాపాడమంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. 2010 నుండి ఇక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ (animal birth control) ప్రోగ్రాం అమలులో ఉంది. అయినా ఒక్క వెటర్నరీ డాక్టర్ (veterinary doctor) లేకపోవడంతో ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ కి స్టెరిలైజేషన్ (sterilised) జరగలేదని తెలుస్తోంది. ఇక ఇక్కడి ఆసుపత్రులలో రోజురోజుకి కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు