విషాదం : సైనికుడిపై దాడి చేసి చంపేసిన ఆర్మీ డాగ్స్ 

  • Edited By: veegamteam , November 15, 2019 / 06:10 AM IST
విషాదం : సైనికుడిపై దాడి చేసి చంపేసిన ఆర్మీ డాగ్స్ 

ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై  రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్నాడు.

గురువారం (నవంబర్ 14)తెల్లవారుజామున వియన్నాకు దక్షిణాన ఉన్న బ్యారక్‌లోకి వెళ్లిన అతను వాటికి ఆహారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో బ్యారక్ లో ఉన్న రెండు కుక్కలు సైనికుడిపై దాడి చేశాయి. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సైనికుడి మృతిపై ఆస్ర్టియా ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ వ్యాన్‌ సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ దాడికి పాల్పడిన డాగ్స్ లో  ఒకటి పూర్తిగా ట్రైనింగ్ పొందినది కాగా..మరొకటి ఆరు నెలల వయస్సులో ఉందని.. ఇది ఇంకా ట్రైనింగ్ లోనే ఉందని అధికారులు తెలిపారు. కాగా..ఆస్ర్టియా ఆర్మీలో మొత్తం 170 శునకాలు ఉన్నాయి.