Uttarakhand : 30 సెకన్లలో హత్య కేసు నిందితుడికి పట్టించిన శునకానికి ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు

హత్య చేసిన నిందితుడికి కేవలం 30 సెకన్లలో పట్టించిన డాగ్ ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు పొందింది.

Uttarakhand : 30 సెకన్లలో హత్య కేసు నిందితుడికి పట్టించిన శునకానికి ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు

' Best Employee of the Month' award For dog

Uttarakhand : ఉత్తరాఖండ్‌ పోలీస్‌ శాఖకు చెందిన ఓ శునకం ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’గా అవార్డు పొందింది. ఓ హత్య కేసును ఛేదించినందుకు ఈ పురస్కారాన్ని అందించారు. హత్య కేసు ఛేధించిన ఓ కుక్కకు ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు ఇచ్చి గౌరవించారు పోలీసులు. నేరాలను ఛేదించి నేరస్థుల్ని పసికట్టటంతో పోలీసు శాఖకు శునకాలు ఎంతగా ఉపయోగపడతాయో చెప్పనక్కరలేదు. పోలీసుల శాఖలో డాగ్ స్వాడ్ అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తోంది. వాసన చూసి నేరస్తులు నేరాలకు ఉపయోగించిన వస్తువులను..పసిగట్టేస్తాయి. పోలీసులు నేరాలను ఛేధించటంతో ఎంతగానే ఈ ట్రైన్డ్ డాగ్స్ పనిచేస్తుంటాయి. అలా ఓ హత్య కేసును ఛేదించిన కుక్కకు ‘బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు ఇచ్చారు ఉత్తరాఖండ్ పోలీసులు. ఈ శునకం పేరు ‘కట్టి’ . అంతేకాదు ఈ శునకానికి రూ.25వేలు నగదు బహుమతిని కూడా ఇచ్చారు.

ఉత్తరాఖండ్‌ లోని జస్పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్చి 6న షకీబ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ కేసు కోసం పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఈకేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈ శునకం ముందు నిలబెట్టారు. అంతే వాసన చూసిన ఈ శునకం కేవలం 30 సెకన్లలో నిందితుడికి గుర్తించింది. శునకం నిందితుడికి పట్టించటంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు శునకం గుర్తించిన వ్యక్తే నేరం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో సదరు శునకం సహాయంతో పోలీసులు హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేధించారు.

శునకం గుర్తించిన వ్యక్తి కదలికలపై దర్యాప్తు చేశారు.దీంతో వారి అనుమానం మరింతగా బలపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన శునకానికి అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని ప్రకటించామని ఉద్దమ్‌సింగ్‌ నగర్‌ ఎస్‌ఎస్‌పీ మంజునాథ్‌ తెలిపారు.

కాగా 2016లో హర్యానాలోని పంచకుల ఐటీబీపీలో ‘కట్టి’డాగ్ కు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఉధమ్ సింగ్ నగర్ లో కటికి పోస్టింగ్ చేయబడింది. అప్పటినుంచి కటి పలు కేసుల్లో నేరస్తులను గుర్తించటంలో చక్కటి ప్రతిభ కనపరుస్తోంది. హెడ్ కానిస్టేబుల్స్ యోగేంద్ర సింగ్, బసంత్ సింగ్ లతో కలిసి హత్యకేసులను ఛేదించటంతో కటి పోలీసులకు సహాయపడుతోంది. ఇప్పుడు కటి 8 సంవత్సరాల వయస్సున్న కట్టికి ట్రాక్ డాగ్ గా ప్రత్యేక ఉంది.