Married Person: ఏడు రాష్ట్రాల్లో 14మందికి భర్త.. సీక్రెట్‌గా మరో మూడు పెళ్లిళ్లు
ఒడిశాలోని 66ఏళ్ల వ్యక్తికి ఏడేళ్లలో 14మందితో వివాహంతో పాటు మరో మూడు పెళ్లిళ్లు జరిగాయని రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. పలు రాష్ట్రాల్లోని చదువుకున్న వ్యక్తులను, మధ్య వయస్కులను...

Married
Married Person: ఒడిశాలోని 66ఏళ్ల వ్యక్తికి ఏడేళ్లలో 14మందితో వివాహంతో పాటు మరో మూడు పెళ్లిళ్లు జరిగాయని రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. పలు రాష్ట్రాల్లోని చదువుకున్న వ్యక్తులను, మధ్య వయస్కులను టార్గెట్ చేసుకుని ఈ పెళ్లి తంతు కొనసాగించేవాడు.
డాక్టర్ గా ఫేక్ ఐడెంటిటీ ఉన్న వ్యక్తి చత్తీస్ ఘడ్ లోని చార్టర్డ్ అకౌంట్ ను కూడా వివాహం చేసుకున్నాడు. అస్సాంలోని ఫిజీషియన్, ఒడిశాలోని బాగా చదువుకున్న మహిళ అందరూ ఇతని బాధితులే. ‘విచారణలో ఫేక్ డాక్టర్ మరో ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది’ అని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యూఎస్ దాష్ అన్నారు.
ఒడిశఆలోని జగత్‍సింగ్‌పూర్ జిల్లాకు చెందిన విద్యార్థి నుంచి మెడికల్ కాలేజీలో సీటు కోసం ఫేక్ డాక్టర్ రూ.18లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. అతని ట్రాన్సాక్షన్లపై విచారణ జరిపే నిమిత్తం మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
Read Also : అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
సదరు వ్యక్తి మూడు పాన్ కార్డులు, 11ఏటీఎంలతో లావాదేవీలు జరిపినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆర్బీఐ సాయంతో ఎవరెవరికీ నగదు బదిలీ అయిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్, పంజాబ్ లలో ఇద్దరేసి చొప్పున, ఒడిశాలో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, అస్సాంలో ముగ్గురు, మధ్య ప్రదేశ్ లో ఇద్దరు, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున ఉన్నారు.
జిల్లా పట్కూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మహిళను పెళ్లాడి డబ్బులతో పారిపోయాడు. ఈ మగానుభావుడికి తొలిసారి 1982లో పెళ్లి అయింది. 20ఏళ్ల తర్వాత రెండో పెళ్లి 2002లో. ఈ రెండు పెళ్లిళ్ల కారణంగా ఐదుగురు సంతానం కలిగారని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాస్ అన్నారు.
Read Also : సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న!
2002 నుంచి 2020 మధ్య కాలంలో మాట్రిమోనల్ వెబ్‌సైట్స్ ద్వారా పరిచయం పెంచుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు.
చివరిగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఢిల్లీ స్కూల్ టీచర్ అయిన మహిళను పెళ్లాడి అక్కడే ఉంటున్నాడు. ఆమెకు తన భర్త గతంలో చేసుకున్న వివాహాల గురించి తెలిసి షాక్ అయింది. పోలీసులకు సమాచారం అందించడంతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
మధ్య వయస్సు మహిళలనే టార్గెట్ చేసుకుని వివాహానికి ప్రయత్నించేవాడని డీసీపీ అంటున్నారు. చాలావరకూ విడాకులు తీసుకుని మాట్రిమోనల్ వెబ్‌సైట్‌లో జోడీ కోసం వెదికేవారిని వివాహమాడేవాడు. తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించేవాడు.
Read Also : పొట్టి శీను పెళ్లి – పెళ్లికి అడ్డు కాని ఎత్తు
డాక్టర్ గా చెప్పుకుని లాయర్లను, ఫిజిషియన్లు విద్యావంతులైన మహిళలను పెళ్లాడేవాడు. ఈ బాధితుల్లో పారా మిలిటరీ బలగాలకు చెందిన మహిళ కూడా ఉంది. ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో మహిళలను మోసం చేశాడు.
గతేడాది స్కూల్ టీచర్ మహిళా పోలీస్ కు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను 2018లో పెళ్లాడి భువనేశ్వర్ తీసుకొచ్చాడు. ఆమెకు విషయం తెలిసి కంప్లైంట్ చేసింది. అతణ్ని అరెస్టు చేసి 11ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానని, లోన్ ఫ్రాడ్ తదితర కంప్లైంట్స్ తో హైదరాబాద్, ఎర్నాకులం ప్రాంతాల్లో రెండు సార్లు అరెస్ట్ కూడా అయ్యాడు.