కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది.
వారం క్రితమే ఒడిషాలోని భువనేశ్వర్, కటక్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు మూత పడగాయయయ రేపటినుంచి 29 వరకు ఐదు జిల్లాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపారా, అంగుల్ జిల్లాల్లో లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ఇప్పటికే పూరీ, రూర్కేలా, సంబల్‌పూర్, జార్షూగూడ, బాలాసోర్, జాజ్‌పూర్ రోడ్, జాజ్‌పూర్ టౌన్, భద్రక్ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్ చేసింది. అత్యవరస సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. దీంతో మొత్తం రాష్ట్రంలో 40 శాతం మూతపడినట్లైంది.