Leopard : ఓ మై గాడ్.. పెళ్లికి వచ్చిన అనుకోని అతిథి, ఒక్కసారిగా హాహాకారాలు, ప్రాణభయంతో పరుగులు తీసిన గెస్టులు..

రాత్రి 11 గంటల ప్రాంతంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది. బంధువులు అరుపులు పెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి రోడ్ లోకి పరుగులు తీశారు.

Leopard : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. అడవిలో ఉండాల్సిన క్రూరమృగం జనాల మధ్యలోకి వచ్చేసింది. పెళ్లి వేడుకు జరుగుతున్న ఇంట్లోకి దూరి తీవ్ర భయాందోళనకు గురి చేసింది. లక్నోలో ఓ ఇంట్లో పెళి వేడుక జరిగింది. బంధుమిత్రులతో ఇళ్లంతా నిండిపోయింది. అంతా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. పెళ్లికి అటెంట్ అయ్యేందుకు గెస్టులు వస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. ఎవరూ ఊహించని గెస్ట్ పెళ్లి వేడుకకు వచ్చింది. అవును.. అడవిలో ఉండాల్సిన చిరుత పులి పెళ్లి ఇంట్లోకి దూరింది.

చిరుతను చూసి హడలిపోయిన గెస్టులు..
చిరుత పులిని చూసి అక్కడ అందరూ హడలిపోయారు. పెళ్లికి వచ్చిన గెస్టులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పారిపోయారు. అరుపులు, కేకలు వేస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. అప్పటివరకు అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరిసింది. సడెన్ గా చిరుత ఎంట్రీ ఇవ్వడంతో కాళరాత్రిలా మారింది.

ప్రాణ భయంతో పరుగులు..
లక్నో సిటీలోని ఎంఎం లాన్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో చిరుత సడెన్ ఎంట్రీ ఇచ్చింది. చిరుతను చూసి జనాలు అరుపులు పెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి రోడ్ లోకి పరుగులు తీశారు. ఓ వ్యక్తి భయంతో బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేయడంతో అతడికి గాయాలయ్యాయి.

ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పరిస్థితి అత్యంత దయనీయం అని చెప్పాలి. బిల్డింగ్ నుంచి బయటకు పారిపోయి వచ్చేశారు ఇద్దరూ. ఓ కారులో దాక్కున్నారు. కారుని లాక్ చేసేసుకున్నారు. బతుకు జీవుడా అంటూ ఇలా ఎవరికి వారు అక్కడి నుంచి దూరంగా పారిపోయారు.

Also Read : కొత్త ఆదాయ పన్ను బిల్లులో 10 ముఖ్యమైన మార్పులివే.. పన్నుచెల్లింపుదారులు తప్పక తెలుసుకోండి!

చిరుత కోసం 5 గంటల పాటు కొనసాగిన వేట..
చివరికి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. 5 గంటల పాటు చిరుత కోసం గాలించారు. చివరికి చిరుతను గుర్తించారు. చిరుత పులి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ లో ఒక దాంట్లో దాక్కుని ఉంది. చిరుతను బంధించే ప్రయత్నంలో అటవీ శాఖ అధికారి ముకద్దర్ అలీ.. చిరుతకు సమీపంగా వెళ్లగా.. చిరుత అతడి మీదకు దూకింది. పంజాతో దాడి చేసింది. చిరుత దాడిలో అధికారి ఎడమ చేతికి గాయమైంది.

చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతి కష్టం మీద చిరుతను బంధించగలిగారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చిరుతను బంధించారు. చిరుతను చూసి పారిపోయే క్రమంలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఎంతో శ్రమించి చిరుతను బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తెల్లవారాక పెళ్లి వేడుకలు మళ్లీ మొదలయ్యాయి.