LPG Gas Cylinder : మళ్లీ పెరిగిన గ్యాస్ ధర .. ఎంతంటే..?

గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి మరోసారి భారంగా మారింది.

LPG gas cylinders

LPG Gas Cylinder Price Today : గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి మరోసారి భారంగా మారింది. ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 7 రూ.పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర ల్ రూ.1,780 కు పెరిగింది. గతంలో ఉన్న రూ.1,773 ధర ఏడు రూపాయలు పెరగటంతో 1,780 రూపాయలకు చేరింది. గృహ అవసర ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పు లేకపోవటం కాస్త ఊరట కలిగిందనుకోవాల్సి ఉంది. కాగా కమర్షియల్ గ్యాస్ ధర పెరటంతో అది సామాన్యుడపై ప్రత్యక్షంగా కాకపోయినా  పరోక్షంగా  భారం పడుతుందనే విషయం తెలిసిందే.

కాగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్‌కు 7 రూపాయల చొప్పున పెంచాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా ప్రతీ నెలా 1తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలు విడుదల చేస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం జులై 4న గ్యాస్ ధరలు పెంచటం గమనించాల్సిన విషయం. జూన్ 1న కమిర్షియల్ గ్యాస్ ధర రూ.83 తగ్గిన విషయం తెలిసిందే.