Major Cargo Ship Collision : అరేబియా సముద్రంలో ఢీకొన్న భారీ కార్గో షిప్ లు

అరేబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి గుజరాత్‌ గల్ఫ

Ship

Major Cargo Ship Collision : అరేబియా సముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో ఓఖాకు 10 మైళ్ల దూరంలో రెండు విదేశీ కార్గో షిప్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి గుజరాత్‌ గల్ఫ్ ఆఫ్ కచ్ లో రెండు పెద్ద కార్గో షిప్‌ లు(MVs Aviator-Atlantic Grace) ఢీకొన్న తర్వాత అందులోని చమురు భారీగా నీటి పాలు అయినట్లు శనివార్ గుజరాత్ పీఆర్ వో ఢిఫెన్స్ ఓ ట్వీట్ లో తెలిపింది.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఓడల్లోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ షిప్‌లను మోహరించి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నట్లు తెలిపింది.

రక్షణ చర్యల కోసం కోస్ట్ గార్డ్స్ బృందంతో పాటు పెట్రోలింగ్ షిప్, హెలికాప్టర్‌ను కూడా మోహరించినట్లు రక్షణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో కాలుష్య నియంత్రణనౌక(Pollution Control Vessel)ను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఢీకొన్న ఓడల ద్వారా ఏమైనా ర‌సాయనాలు స‌ముద్రంలో క‌లిసి ఉంటే ఈ నౌకతో శుభ్రం చేయనున్నారు.

ALSO READ Mallikarjun Kharge : బీజింగ్ జనతా పార్టీగా మారిన బీజేపీ!