CBI raids: ఒకే సమయంలో సీబీఐ అలా ఎలా కనిపిస్తోంది? కాంగ్రెస్ తీరుపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒమర్ ప్రస్తావిస్తూ ‘‘ఇదెలా సాధ్యం? కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లోకి ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ సంస్థలు దర్యాప్తుకు వస్తే, బీజేపీ ఏజెంట్లని అంటారు. అదే ఆప్ నేతలను టార్గెట్ చేసినప్పుడు ఉన్నపళంగా అవి నిష్పాక్షికతను సంతరించుకున్నాయి. ఈ సంస్థలు బీజేపీ ఏజెంట్లుగా, నిష్పాకి సంస్థలుగా ఒకే సమయంలో ఎలా కనిపించాయో అర్థం కావడం లేదు’’ అని అన్నారు.

CBI raids: లిక్కర్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చేసిన విమర్శలపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నేతలపై సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ విచారణకు వస్తే బీజేపీ ఏజెంట్లని నిందించే కాంగ్రెస్ పార్టీ.. మరి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల విషయంలో ఎందుకు అవే సంస్థల్ని నిష్పాక్షికంగా చూస్తున్నాయో తనకు అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సీబీఐ రైడ్ల నేపథ్యంలో మనీశ్ సిసోడియా అవినీతి బయటికి వచ్చిందని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం ఆదివారం డిమాండ్ చేసింది. ఎడ్యూకేషన్ పాలసీ డిబేట్ పేరుతో వాస్తవాలు దాస్తున్నారని, ముందు లిక్కర్ కుంభకోణం గురించి వాస్తవాలు బయట పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ‘‘సీబీఐ రైడ్లతో ఆప్ అవినీతి బయటపడింది. ఎడ్యూకేషన్ పాలసీ డిబేట్ పేరుతో లిక్కర్ పాలసీలో జరిగిన కుంభకోణాన్ని దాచాలని చూస్తున్నారు. వాస్తవాలు వెల్లడించాలి. మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలను ఒమర్ ప్రస్తావిస్తూ ‘‘ఇదెలా సాధ్యం? కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లోకి ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ సంస్థలు దర్యాప్తుకు వస్తే, బీజేపీ ఏజెంట్లని అంటారు. అదే ఆప్ నేతలను టార్గెట్ చేసినప్పుడు ఉన్నపళంగా అవి నిష్పాక్షికతను సంతరించుకున్నాయి. ఈ సంస్థలు బీజేపీ ఏజెంట్లుగా, నిష్పాకి సంస్థలుగా ఒకే సమయంలో ఎలా కనిపించాయో అర్థం కావడం లేదు’’ అని అన్నారు.

Noida: మహిళతో దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్ త్యాగికి మద్దతుగా సభ.. బీజేపీ ఎంపీపై తీవ్ర విమర్శలు

ట్రెండింగ్ వార్తలు