Noida: మహిళతో దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్ త్యాగికి మద్దతుగా సభ.. బీజేపీ ఎంపీపై తీవ్ర విమర్శలు

‘‘పోలీసులు శ్రీకాంత్ త్యాగి అత్తను తమ జీపులో ఎక్కించుకుని నాలుగు రోజులపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ తిప్పారు. ఇది అమానవీయం. ఏదైనా తప్పు చేస్తే శ్రీకాంత్‭ను శిక్షించాలి. కానీ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఇది త్యాగి కమ్యూనిటీని అవమానించడమే. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం’’ అని నిరసన సందర్భంగా త్యాగి కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అన్నారు.

Noida: మహిళతో దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్ త్యాగికి మద్దతుగా సభ.. బీజేపీ ఎంపీపై తీవ్ర విమర్శలు

massive rally for support to srikant tyagi in noida

Noida: కొద్ది రోజుల క్రితం నోయిడాలో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆమెపై దాడికి పాల్పడ్డ బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీకాంగ్ త్యాగికి మద్దతుగా త్యాగి కమ్యూనిటికి చెందిన వారు నోయిడాలో ‘పంచాయత్’ పేరుతో నిరసన చేపట్టారు. శ్రీకాంత్ త్యాగికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక ఎంపీ మహేష్ శర్మపై విమర్శలు గుప్పించారు. శ్రీకాంత్ త్యాగి బీజేపీకి చెందిన వ్యక్తి కాదంటూ గౌతమ్ బుద్ధ్ నగర్ ఎంపీ మహేష్ శర్మ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వారు తీవ్రంగా నిరసించారు.

మహేష్ శర్మ తమ కమ్యూనిటీని అవమానించారని, తమ కమ్యూనిటీ నేతను పార్టీ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారంటూ సంయుక్త్ త్యాగి స్వాభిమాన్ మోర్చా పేరిట నిరసన చేపట్టారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున త్యాగి కమ్యూనిటీకి చెందిన వారు పెద్ద ఎత్తున ఈ నిరసనకు హాజరయ్యారు. తాము మహిళలపై అసభ్య ప్రవర్త, అన్యాయం, అణచివేత, దుర్వినియోగాలను సమర్ధించడం లేదని అయితే ఈ పేరుతో అతడి భార్య, అత్తకు సమన్లు పంపడం సరికాదని అన్నారు.

‘‘పోలీసులు శ్రీకాంత్ త్యాగి అత్తను తమ జీపులో ఎక్కించుకుని నాలుగు రోజులపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ తిప్పారు. ఇది అమానవీయం. ఏదైనా తప్పు చేస్తే శ్రీకాంత్‭ను శిక్షించాలి. కానీ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఇది త్యాగి కమ్యూనిటీని అవమానించడమే. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం’’ అని నిరసన సందర్భంగా త్యాగి కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అన్నారు.

Bihar: ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమారే..! తేజశ్వీ యాదవ్ కీలక ప్రకటన

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు. త్యాగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయట. 2007 నుంచి ఆయనపై అదే మహిళ తొమ్మిది కేసులు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. బెదిరింపులు, నేరపూరిత చర్యలు, అల్లర్లు, హింస వంటి చర్యల కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. 2020లో త్యాగిపై హత్యాయత్నం, క్రమినల్ కేసులు నమోదైంది.

కాగా,కొద్ది రోజులకు తాను దుర్భషలాడిన మహిళకు శ్రీకాంత్ త్యాగి క్షమాపణలు చెప్పాడు. ఆమె తనకు సోదరిలాంటిదని, క్షమించాలని వేడుకున్నారు. ‘‘నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఎవరితో ఇలా ప్రవర్తించను’’ అని త్యాగి అన్నారు.

Mizoram: డాక్టర్‭పై దాడి చేసిన మిజోరాం సీఎం కుమార్తె.. క్షమాపణ చెప్పిన సీఎం