Mizoram: డాక్టర్‭పై దాడి చేసిన మిజోరాం సీఎం కుమార్తె.. క్షమాపణ చెప్పిన సీఎం

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కుటుంబంపై విమర్శలు భగ్గుమన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం యూనిట్ నల్ల దుస్తులు ధరించి శనివారం నిరసన చేపట్టింది. దీంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే తన కూతురి ప్రవర్తనపై కూడా విచారం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తనను తానెంత మాత్రం సమర్ధించనని ఆయన అన్నారు.

Mizoram: డాక్టర్‭పై దాడి చేసిన మిజోరాం సీఎం కుమార్తె.. క్షమాపణ చెప్పిన సీఎం

Mizoram CM Daughter Hits Doctor then cm says sorry

Mizoram: తన కూతురు ఒక డాక్టర్‭పై దాడి చేయడాన్ని ఖండిస్తూ విమర్శలు రావడంతో మిజోరాం ముఖ్యమంత్రి జొరంతంగ బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను షేర్ చేస్తూ ఆమె అహంకారపూరితంగా వ్యవహరించిందంటూ ముఖ్యమంత్రి సహా కుటుంబ సభ్యులపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

డాక్టర్‭పై దాడి చేసిన సీఎం కూతురి పేరు మిలారి ఛాంగ్టే. వివరాల్లోకి వెళితే.. మిజోరాం రాజధానిలోని ఐజ్వాలో ఉన్న ఒక గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లింది. అయితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడంతో తనను కలవడం కుదరని, తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలని సదరు డాక్టర్ సూచించారు. దీంతో విసిగెత్తి పోయిన ఆమె.. బయటికి వెళ్లే క్రమం నుంచి లోపలికి పరుగెత్తుకొచ్చిన ఆయన ముఖంపై పిడిగుద్దు గుద్దింది. ఆమెతో పాటు వచ్చిన ఒక వ్యక్తి.. ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం జరిగినట్లు నెటిజెన్లు చెబుతున్నారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కుటుంబంపై విమర్శలు భగ్గుమన్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం యూనిట్ నల్ల దుస్తులు ధరించి శనివారం నిరసన చేపట్టింది. దీంతో ముఖ్యమంత్రి దిగిరాక తప్పలేదు. బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే తన కూతురి ప్రవర్తనపై కూడా విచారం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తనను తానెంత మాత్రం సమర్ధించనని ఆయన అన్నారు.

Bihar: ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమారే..! తేజశ్వీ యాదవ్ కీలక ప్రకటన