Rajiv Murder Case: రాజీవ్ గాంధీ హత్యకేసులో.. నిందితుడి విడుదల పిటీషన్‌పై నేడు సుప్రింకోర్టులో తుదితీర్పు

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హత్యకేసులో ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ యావజ్జీవ ఖైదీగా ఉన్నారు. అయితే పెరారివాలన్‌ను జైలు నుంచి ...

Rajiv Murder Case: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హత్యకేసులో ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ యావజ్జీవ ఖైదీగా ఉన్నారు. అయితే పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై సుప్రింకోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించే అవకాశముంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 21 మే 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో వారి క్షమాభిక్ష పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది.

Rajiv Murder Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి బెయిల్ మంజూరు

అయితే ఇప్పటికే రాజీవ్ గాంధీ హత్యకేసులో కీలక నిందితులుగా ఉన్న నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురగన్ తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు అనుకూలమైన తీర్పుకు మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు 19ఏళ్ల వయస్సులో పెరారివాలన్ బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. కేసు విచారణ సమయంలో 1998లో పెరారివాలన్ కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 2014లో సుప్రింకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.

Rajiv Gandhi Murder Case : విషమించిన తల్లి ఆరోగ్యం.. నళినికి నెల రోజుల పెరోల్‌

కొంతకాలంకు పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం వ్యతిరేకించింది. కానీ తమిళనాడు గవర్నర్ పెరారివాలన్ విజ్ఞప్తి విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. చాలా ఏళ్ల పాటు ఏకాంత ఖైదులో ఉన్న పెరారివాలన్ జైలులో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడని, సుదీర్ఘ ఖైదు సమయంలో అతను అనేక విద్యా అర్హతలను పొందడంతో పాటు, అతను ఒక పుస్తకాన్ని కూడా రచించినట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు