శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్‌లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
మరో 3-4 రోజుల్లో భారీ ఆయుధాలతో పుల్వామా తరహా దాడిని చేసేందుకు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు రెడీగా ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సరిహద్దులలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ సంస్థలు ముందస్తు హెచ్చరికలు జారీ చేసాయి.
Also Read : సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు
ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఎల్‌వోసీ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ ఉగ్రవాద స్థావరం నుంచి భారత్ లో ప్రవేశ పెట్టేందుకు పాక్ ఆర్మీ సహాయం చేస్తుందని నిఘావర్గాలు వెల్లడించాయి.
ఎల్వోసీ వద్ద ఉన్న నిఖియాల్ సెక్టార్, మోహ్ర ష్రీడ్ గ్రామంలో ఉగ్రవాదుల కదలికలను నిఘావర్గాలు గుర్తించి ఈ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో సరిహద్దుల వెంబడి భద్రత మరింత పెంచారు. జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే చెప్పాలని భద్రతా దళాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
Also Read : నిగ్గుతేల్చాలి హైకోర్టు ఆదేశం : వివాహేతర సంబంధాలకు కారణం టీవీ సీరియల్స్, సినిమాలేనా?