Cobra Snake: బీహార్ లోని బెట్టియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఏడాది వయసున్న బాలుడు ఓ నాగుపాముని కొరికి చంపేశాడు. బాలుడు తన ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి పాము వచ్చింది. పాము బాలుడి చేతిని చుట్టుకుంది. అదేంటో తెలియని బాబు.. దాన్ని నోటితో కొరకడంతో పాము చనిపోయింది. ఆ తర్వాత కాసేపటికే చిన్నారి కూడా స్పృహ కోల్పోయాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే బాబుని ఆసుపత్రికి తరలించారు.
”బాలుడు ఆడుకుంటూ ఉండగా పాము అతనికి దగ్గరగా వచ్చింది. అది ఏంటో తెలుసుకోలేని బాలుడు దాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని తన దంతాలతో కొరికాడు. ఆ వెంటనే పాము చనిపోయింది” అని స్థానికులు తెలిపారు.
కొన్ని గంటల తర్వాత బాలుడు గోవింద పరిస్థితి దిగజారడం ప్రారంభమైంది. అతని కుటుంబం మొదట సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి బెట్టియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి (GMCH) తరలించారు. బాలుడికి చికిత్స అందించారు డాక్టర్లు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాబు క్షేమంగానే ఉన్నాడని, శరీరంలో విషం లేదని నిర్ధారించారు. బాబుని అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు.
గోవింద తల్లి కట్టెలు సేకరిస్తున్న సమయంలో ఆమెకు పాము కనిపించిందని ఆ చిన్నారి అమ్మమ్మ మాతేశ్వరి దేవి చెప్పింది. బాలుడు పామును కొట్టి కొరికినట్లు ఆమె తెలిపింది. “ఆ పాము బయటకు వచ్చింది, ఆ పిల్లవాడు దాన్ని ఏదో ఒకదానితో కొట్టి, ఆపై కరిచి చంపేశాడు. అది ఒక గెహువాన్ (నాగుపాము). ఆ చిన్నారి వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే” అని ఆమె వెల్లడించింది.
Also Read: భారత్‌లో వన్యప్రాణి ఫొటోగ్రఫీ.. ఈ 7 అద్భుతమైన అభయారణ్యాలను మిస్ అవ్వకండి..