ఉల్లిపాయలు..దేశాలకు దేశాల్నే వణింకించేశాయి. అత్యంతధికంగా ధరలతో ప్రజల జేబులు గుల్ల చేసేశాయి. ఉల్లి వార్తలతో సోషల్ మీడియాలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో సంక్రాంతికి సందడి చేసే పంతంగుల్లో ఉల్లి పంతంగులకు భటే డిమాండ్ పెరిగింది. గుజరాత్ లో రాష్ట్రం నిర్వహించే పంతంగోత్సవంలో ఉల్లి పతంగులు సందడి చేస్తున్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ దగ్గర పతంగోత్సవ్‌ను సీఎం విజయ్ రూపాణీ ప్రారంభించారు. ఈ కైట్ ఫెస్టివల్‌లో ఉల్లి ఆకారంలో తయారు చేసిన పతంగులు గాలిలో ఎగురుతూ సందడి చేస్తున్నాయి. ఈసారి ఉల్లి పతంగులకు మరింత డిమాండ్ పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరను ఈ పంతంగులు ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
పంతంగుల పెస్టివల్‌లో ఎగురవేసిన అతిపెద్ద ఉల్లి పతంగు అక్కడున్నవారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పెద్ద ఉల్లిపతంగు తయారీలో వెదురు, టిష్యూను వినియోగించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఫెస్టివల్‌లో తొలిరోజున 43 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే మన దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 115 మంది కైట్ ఆటగాళ్లు పాల్గొన్నారు.
ఈ మధ్య కాలంలో బాగా హీటిక్కించించిన ఉల్లిపాయలు పంతంగుల పండుగలో కూడా నాదే పైచేయి అంటున్నాయి. సంక్రాంతి పండుగ అంటే పంతంగులు గుర్తుకొస్తాయి. పిల్లలు పెద్దలు పంతంగులు ఎగురవేస్తు చేసే సందడి అంతా ఇంతాకాదు. ఇది కేవలం గ్రామాలకే పరిమితం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంతంగుల ఉత్సవాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉల్లిపాయ పతంగుల సందడి చేస్తున్నాయి.