Adani issue In Parliament : పార్లమెంట్‌లో అదానీ ప్రకంపనలు .. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్..

అదానీ గ్రూప్‌ షేర్ల పతనం స్టాక్ మార్కెట్ లోనే కాదు పార్లమెంట్ లో కూడా హీట్ పుట్టిస్తోంది. ఆదానీ సెగలు పార్లమెంట్ ను తాకాయి. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.అలాగే అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి చర్చించాలని సీపీఐ డిమాండ్ చేసింది.

Parliament..Adani..Hindenburg Report : అదానీ గ్రూప్‌ షేర్ల పతనం స్టాక్ మార్కెట్ లోనే కాదు పార్లమెంట్ లో కూడా హీట్ పుట్టిస్తోంది. ఆదానీ సెగలు పార్లమెంట్ ను తాకాయి. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.అలాగే అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి చర్చించాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాజ్యసభలో ఎంపీ బినోయ్ విశ్వం వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇలా అత్యంత తక్కువ సమయంలోనే ప్రపంచ కుబేరుల స్థాయికి చేరుకున్న అదానీ పేరు పార్లమెంట్ ను కూడా కుదిపేస్తోంది. ప్రధాని మోడీ అండతోనే అదానీ ఈ స్థాయికి చేరుకున్నారని దేశ సంపదను అదానీకి ప్రధాని మోడీ దోచిపెడుతున్నారని కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నట్లుండి పులిమీద పుట్రలా వచ్చి పడ్డ హిండెన్ బర్గ్ నివేదిక ప్రకటతో అదానీ గ్రూప్ షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అదానీ గ్రూపు లో పెట్టుబడులు పెట్టిన పలు బ్యాంకులు, ఎల్ఐసీ పరిస్థితి ఏంటా?అనే పెద్ద సందిగ్థత ఏర్పడింది. ఈక్రమంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.

Adani Enterprises Key Decision : అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. ఎఫ్ పీవో ఆఫర్ రద్దు.. రూ.20వేల కోట్లు తిరిగి పెట్టుబడిదారులకు చెల్లింపు

నిన్న మొన్నటి దాక స్టాక్ మార్కెట్లను కుదిపేసిన అదానీ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్‌ను తాకింది. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల జరుగుతున్న క్రమంలో అఖిలపక్ష సమావేశంలో అదానీ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టాయి. అదాని కంపెనీలను రాత్రికి రాత్రే తల్లక్రిందులు చేసిన హిండెన్‌బర్గ్ అదానీ పేరును పార్లమెంట్ వరకు తీసుకొచ్చింది. పంచాయితీ పెట్టింది.

పోర్టుల నుంచి ఎనర్జీ వరకు బహుళ వ్యాపార సంస్థలు కల్గిన అదానీ గ్రూప్ అత్యధిక స్థాయిలో రుణాలు తీసుకుందని ఆరోపించింది హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులను ఎగవేయానికి అదానీ గ్రూప్ ఎన్నో సంస్థలను సృష్టించిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు భారీగా పతనమైపోయాయి. అలా లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టేశాయి. దీంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు ఎల్‌ఐసి కూడా తీవ్రంగా నష్టపోయింది.







                                    

ట్రెండింగ్ వార్తలు