Mask లేని వారిని అరెస్టు చేయండి సర్కార్ ఆదేశాలు

  • Publish Date - November 28, 2020 / 11:23 AM IST

arrest people not wearing mask : కరోనా కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. ఇవి పాటించకపోతే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే..రూ. 2 వేల జరిమాన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బయటకు వచ్చిన సమయంలో మాస్క్ లేకపోతే వెంటనే వారిని అరెస్టు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.



దోషిగా తేలితే..8 రోజులు లేదా రూ. 5 వేల వరకు జరిమాన విధించబడుతుందని Sirmaur Superintendent of Police (SSP) వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. మాస్క్ ధరించని వారితో వాదనలు చెలరేగుతున్నాయి.



https://10tv.in/sachin-tendulkar-loses-his-way-in-mumbai-lanes/
కరోనా వైరస్ నియంత్రణకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. జైపూర్, జోద్పూర్, కోటా, బికనూర్, ఉదయ్ పూర్, అజ్మీర్, అల్వార్, భిల్వారా పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉందాలని ప్రభుత్వం నిర్ణయించింది