Jyoti : ఒక‌ప్పుడు భిక్ష‌మెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజ‌ర్ అయ్యింది

జ్యోతి ప్రతిభ తెలుసుకున్న ‘లెమన్‌ కేఫ్‌ ( Lemon Cafe )’ అనే రెస్టారెంట్‌ యాజమాన్యం మేనేజర్‌గా అవకాశమిచ్చింది. జ్యోతి సంపాదనలో సగం డబ్బును ‘రాంబో హోం ఫౌండేషన్‌’కు విరాళంగా ఇస్తోంది.

Jyoti

Orphanage Girl Jyoti : ఒక‌ప్పుడు రోడ్ల‌పై భిక్ష‌మెత్తుకున్న మహిళ… ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజ‌ర్ అయ్యిందంటే నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. చెత్తకుప్పలో దొరికిన పసిగుడ్డును ఓ యాచకురాలు అక్కున చేర్చుకుంది. ఆ పపిసాపకు తనే పేరు పెట్టింది. తనతోపాటు భిక్షాటనకు తీసుకెళ్లేది. అంతలోనే ఆమె మరణించింది. ఆ బాలికకు ఒక శరణాలయం ఆశ్రయమిచ్చింది. అంతేకాంకుడా అక్షరాలు నేర్పింది. ఆ అనాథ మహిళే.. ప్రస్తుతం ఓ కెఫేలో మేనేజర్‌గా పనిచేస్తోంది.

19 సంవత్సరాల క్రితం బీహార్‌ రాజధాని పాట్నాలో ఓ సంఘటన జరిగింది. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదుగానీ పాపం.. ఓ తల్లి తన బిడ్డను చెత్తకుప్పలో పడేసిపోయింది. పసిగుడ్డు గుక్కపెట్టి ఏడుస్తోంది. భిక్షమెత్తుకుంటున్న కరీదేవికి ఆ పసిపాప ఏడుపులు వినిపించాయి. అటూ ఇటూ చూసి.. గట్టిగా పిలిచింది. అయితే పాప కోసం ఎవరూ రాలేదు. తానే భిక్షమెత్తుకుని పొట్ట నింపుకొంటోంది. ఇక పాపనేం పోషిస్తుంది? కానీ, ఆమె మనసు మాత్రం స్థిరంగా ఉండనీయలేదు.

Identification for ‘Mother Name’ : గుర్తింపు కార్డుల్లో ‘అమ్మ పేరు’ కోసం పోరాడి సాధించిన యువకుడు

ఆ పసిపాపను అక్కున చేర్చుకుంది. ఆ బిడ్డకు జ్యోతి అని పేరు పెట్టింది. అడుక్కుని కడుపునింపింది. వీధుల్లోనే పెంచి పెద్దచేసింది. ఆ అమ్మతో కలిసి భిక్షమెత్తుకుంటూ, చెత్త సేకరిస్తూ జ్యోతి పెద్దదైంది. ఆ అమ్మాయికి పన్నెండేండ్లు వచ్చేసరికి.. అనారోగ్యంతో కరీదేవి మరణించింది. దీంతో జ్యోతిని ‘రాంబో హోమ్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ చెంతన చేర్చుకుంది.

ఫౌండేషన్‌ నిర్వాహకులు జ్యోతికి చదువు నేర్పించారు. పదో తరగతి పరీక్షలు రాయించారు. తను మంచి మార్కులతో పాసైంది. పాట్నాలో ఒక ఆఫీస్‌లో పనికి చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తూనే మార్కెటింగ్‌ కోర్సు చేసింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆర్నెల్లు సేల్స్‌గర్ల్‌గా పని చేసింది. ఇప్పుడు ఆమెకు పందొమ్మిదేండ్లు.

Britannia Women Workers :మహిళా ఉద్యోగుల సంఖ్య 50శాతానికి పెంచుతున్న బ్రిటానియా

జ్యోతి ప్రతిభ తెలుసుకున్న ‘లెమన్‌ కేఫ్‌ ( Lemon Cafe )’ అనే రెస్టారెంట్‌ యాజమాన్యం మేనేజర్‌గా అవకాశం ఇచ్చింది. జ్యోతి తన సంపాదనలో సగం డబ్బును ‘రాంబో హోం ఫౌండేషన్‌’కు విరాళంగా ఇస్తోంది. పాట్నా జంక్షన్‌లో భిక్షమెత్తుకున్న జ్యోతి చదువుతో తన జీవితాన్ని మార్చుకుంది. అక్షరాల ఆసరాతో తలరాతను తిరగరాసుకుంది. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.