Identification for ‘Mother Name’ : గుర్తింపు కార్డుల్లో ‘అమ్మ పేరు’ కోసం పోరాడి సాధించిన యువకుడు

గుర్తింపు కార్డుల్లో ‘అమ్మ పేరు’ కోసం పోరాడి సాధించాడు ఓ యువకుడు.

Identification for ‘Mother Name’ : గుర్తింపు కార్డుల్లో ‘అమ్మ పేరు’ కోసం పోరాడి సాధించిన యువకుడు

International Women’s Day Identification For ‘mother Name’

International Women’s Day Identification for ‘Mother Name’ : అంతర్జాతీయ మహిళా దినోత్సం అంటే ఒక్కరోజు కాదు. మహిళలకు ఆ ఒక్కరోజే గౌరవించేస్తున్నట్లు ఉత్సవాలు జరిపేసుకోవటం కాదు. మదర్స్ డే అంటే ఆ ఒక్కరోజు అమ్మకు బహుమతులు ఇచ్చేసి శుభాకాంక్షలు చెప్పేయటం కాదు.. తల్లిని, చెల్లిని, భార్యను ఇలా ఎవరినైనా ఎప్పుడు గౌరవించాలి. గుర్తించాలి. మహిళా దినోత్సవం అని జరిపే ప్రభుత్వాలు ఎంతమేరకు మహిళలకు గౌరవాలను గుర్తింపును ఇస్తున్నాయి? అంటే కాస్త ఆలోచించాల్సిందే. అన్ని గుర్తింపు కార్డుల్లోను తండ్రి పేరు, భర్త పేరు,లేదా కొడుకు పేరుతోనే మహిళలకు గుర్తింపు ఉంటుంది. ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అనేది ఉండదు. అలా కాదు నాకు మా అమ్మపేరుతోనే గుర్తింపు కావాలని ఓ యువకుడు పోరాడి మరీ సాధించుకున్న వైనం గురించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలుసుకుందాం..

Also read : Women’S Day : భారత చరిత్రలో ‘తొలి’ మహిళలు..’తొలి’ అడుగు

ప్రభుత్వం చట్టబద్దంగా ఇచ్చే గుర్తింపుకార్డులో ‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడు సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాడు 23 ఏళ్ల యువకుడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. ఆ కొడుకు పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్‌ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్‌ పోరాట పటిమతో తన తల్లిపేరును సార్థం చేసుకున్నాడు.

సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతనికి రెండేళ్లు ఉన్నప్పుడే విడిపోయారు. సువామ్ తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్‌పూర్‌. సువామ్ కోల్‌కతాలో హైస్కూల్ చదువు పూర్తి చేశాక సువామ్‌ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించాడు.దానికి అతను కుదరదన్నాడు. తండ్రిపేరుతోనే ఇస్తాం అందరికి అలాగే ఇస్తున్నాం అని తేల్చి చెప్పాడు. దానికి సువామ్ కన్నతల్లిపేరు ఎందుకు ఉండదు? ఎందుకు మా అమ్మ పేరుతో ఇవ్వరు? అని ప్రశ్నించాడు.దానికి ప్రిన్సిపాల్ అది అంతే అని తెగేసి చెప్పాడు. బహుశా ఆ ప్రిన్సిపాల్ కు అప్పుడు తెలియదు. తాను కుదరదు అని చెప్పిన మాట పోరాటంగా మారుతుంది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు సువామ్ సుదీర్ఘ పోరాటం చేశాడు.

Also read : అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశేషాలు

ఈ విషయంపై ఎన్నో చర్చలు..మరెన్నో వితండవాదాలు. అలా ఎన్నో చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా అటువంటి ఇబ్బందులే వచ్చాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది.

పాన్‌కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో తన మనస్సులోని సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు పొందాడు.దానికి సుమావ్ ఏమాత్రం బెదరలేదు. మొదట్లో చాలా చాలా బాధపడేవాడు. కానీ తను అనుకున్నది సాధించాలంటే ఇటువంటి అవగాహనలేకుండా మాట్లాడేవారి మాటల్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అలా అతని పోరాటంలో ఎన్ని హేళన మాటలువినిపించినా పట్టించుకోలేదు.

Also read : Women Employees Leave : అంతర్జాతీయ మహిళా దినోత్సవం…తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

తండ్రి పేరే గుర్తింపా? తల్లికి విలువలేదా?
‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపుగా ఎందుకు ఉండాలి? మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు? నా మంచి చెడ్డలు. నా చదువులు, నాకు కావాల్సినవి అన్ని ఇచ్చేది. మరి అటువంటప్పుడు నా జీవితంలో లేని నాన్న పేరుతో నాకు గుర్తింపు ఎందుకు? అని ప్రశ్నించేవాడు. నా పుట్టుకకు కారణమైనంత మాత్రాన నాకు తెలియని మా నాన్న గుర్తింపు నాకు వద్దు..నాకు అన్నీ తానైనా మా అమ్మపేరే నాకు కావాలని అని పోరాడాడు. మా నాన్నతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్‌ సిన్హా. అలా తన జీవితంలో లేని మానాన్న గుర్తింపు నాకు వద్దు నా తల్లి గుర్తింపే నాకు కావాలి అని చెప్పేవాడు. నా గుర్తంపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్‌, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా వినతులు పంపాడు.

Also read : #DriveLikeALady : బ‌స్సు న‌డిపి డ్రైవ‌ర్ ప్రాణాలు కాపాడిన యోగితా సతావ్ స్ఫూర్తితో కొట‌క్ మహీంద్రా బ్యాంక్ యాడ్‌ వైరల్

సింగిల్‌ పేరెంట్స్‌ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్‌లైన్‌లో దీన్ని అప్‌డేట్‌ చేయలేదు. సువామ్‌ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును రాసి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హా పోరాట పటిమ అసలైన మహిళా గుర్తింపు అని చెప్పి తీరాల్సిందే. ఇటువంటి వినూత్న పోరాటాలే మార్పులకు నాంది పలికేది అని ప్రతి ఒక్కరు గుర్తించాలి.