Britannia Women Workers :మహిళా ఉద్యోగుల సంఖ్య 50శాతానికి పెంచుతున్న బ్రిటానియా

మహిళా ఉద్యోగుల సంఖ్య 50శాతానికి పెంచనుంది బ్రిటానియా. బ్రిటానియా సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉంది.దీన్ని 50 శాతానికి పెంచుతామనిని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ తెలిపారు.

Britannia Women Workers :మహిళా ఉద్యోగుల సంఖ్య 50శాతానికి పెంచుతున్న బ్రిటానియా

Britannia Will Be Reached 50 Percent Women Work Force By 2024 (1)

Updated On : March 18, 2022 / 1:13 PM IST

Britannia aims 50 percent women in workforce by 2024 : ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. 2024 నాటికి సంస్థలో మహిళా వర్కర్స్ శాతాన్ని 50కు పెంచనున్నామని ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటానియా సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉంది.దీన్ని 50 శాతానికి పెంచాలని నిర్ణయించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (CMo)అమిత్‌ దోషి తెలిపారు. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో ఉన్న బ్రిటానియా ఫ్యాక్టరీలో మహిళల సంఖ్య 60 శాతం ఉందని, దీనిని 65కు చేర్చనున్నామని తెలిపారు.

సంస్థలో లింగ సమానత్వం కోసం..మహిళా సాధికారత కోసం మహిళల సంఖ్య పెంచాలనుకుంటున్నామని తెలిపారు. కంపెనీ ఇప్పటికే స్టార్టప్‌ చాలెంజ్‌ను ప్రారంభించిందని ఈ సందర్భంగా అమిత్ వెల్లడించారు.ఈ–కామర్స్, డిజిటల్‌ సర్వీసెస్‌, మొబైల్‌ వ్యాన్స్‌ ద్వారా కంటి సంబంధ చికిత్స సేవలు, పిల్లల విద్య తదితర విభాగాల్లో స్టార్టప్స్‌ కోసం 30 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నిధులు సమకూర్చామని తెలిపారు. మహిళలకు స్కిల్స్ ట్రైనింగ్ కోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంవో అమిత్ కలిపామన్నారు.