Gouri Sankar Dutta Dies
Gouri Sankar Dutta dies : తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే గౌరీ శంకర్ దత్తా కోవిడ్ -19 కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు సీనియర్ వైద్యులు తెలిపారు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇటీవల బిజెపిలో చేరారు దత్తా(70).. అయితే ఆయన 10 రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఆయనను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యేను కోల్‌కతాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అయినా లాభం లేకుండా పోయింది శ్వాసకోశ సమస్యతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నాడియా జిల్లాలోని టెహట్టా నుంచి దత్తా ఎన్నికయ్యారు.. వయోభారం కారణంగా చూపి తృణమూల్ కాంగ్రెస్ ఆయనకు మరో దఫా టిక్కెట్ నిరాకరించింది. దాంతో ఆయన జెపి నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. గౌరీ శంకర్ మృతిపట్ల పలువురు పార్టీల నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.