Maharashtra : ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా.. అసెంబ్లీలో 50 దాటిన పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.

Maharashtra :  మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని ఆయన చెప్పారు.

290 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటి వరకు 50 కరోనా కేసులు వెలుగు చూశాయి. కాగా… మంత్రులు, ఎమ్మెల్యేలలో ఎవరికి ఒమిక్రాన్ లక్షణాలు లేవని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదుల కొనసాగుతోంది.

నిన్న కొత్తగా రాష్ట్రంలో 8,067 కోవిడ్ కేసులు నమోదు కాగా, 8 మంది కోవిడ్ వల్ల మరణించారు. రాష్ట్రంలో  ఒమిక్రాన్ కేసులు సంఖ్య 454 కి చేరింది. ముంబైలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో జనవరి 15 వరకు సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధించారు.

Also Read : Landslide In Haryana : హర్యానాలో కొండ చరియలు విరిగి పడి 15 మంది గల్లంతు

బీచ్‌లు, బహిరంగ మైదానాలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాల వద్ద కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బహిరంగ సమావేశాలకు మీటింగ్ లకు 50 మందికి మించి అనుమతించటంలేదు. రాష్ట్రంలో బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు