Wedding Bells  : శుభలగ్నం : నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్ళిళ్లు

కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్   వ్యాక్సిన్  వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన  పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి.

Wedding Bells :  కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్   వ్యాక్సిన్  వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన  పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి. వివిధ దేశాల్లోనూ కోవిడ్ ఆంక్షలు సడలించటంతో   విదేశాల్లోని వధూవరులు కూడా స్వదేశం వచ్చి ఒకింటి వారవుతున్నారు.

లక్షలాది మంది ఇళ్లలో   బాజాభజంత్రీలు మ్రోగబోతున్నాయి. పైగా ఈనెల 20 న గురువు గోచార మార్పుతో కూడా ముహూర్తాలు బాగా ఉండటంతో కళ్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఈ కార్తీకమాసం ముహూర్తాల సీజన్ లో దాదాపు అన్ని కళ్యాణ మండపాలు ముందస్తుగానే బుకింగ్ లు జరిగిపోయాయి. వివాహాల విషయంలో రెండేళ్లనాటి సాధారణ పరిస్ధితి మళ్లీ కనపడుతోంది.

ఒక అంచనా ప్రకారం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 13వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేశారు.  ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తోంది. కరోనా ఆంక్షల్ని సవరించిన తర్వాత వచ్చిన ఆగస్టు శ్రావణమాసంలోని  13 రోజుల మహూర్తాలలోనే ఏపీలో 47 వేలకు పైగా వివాహాలు అయినట్లు తెలిసింది.

Also Read : Winter Drinks : చలికాలంలో జలుబు,దగ్గు సమస్యలకు చెక్ పెట్టే పానీయాలు

నవంబర్ 21,27,28, డిసెంబర్ 8 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో   స్టార్ల హోటళ్లతో సాహ   లాడ్జి ఫెసిలిటీ ఉన్న అన్ని  హోటళ్లలో  రూమ్‌లు   ఖాళీ లేవంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ముహూర్తాల  సందడితో బంగారం షాపులు, బట్టల కొట్లు కిటకిట లాడుతున్నాయి. వాటితో పాటు కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.  ఖర్చు ఎంత పెరుగుతున్నా పెళ్లి మేళం గట్టిగా వినిపించేందుకు ప్రజలు సిధ్ధమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు