JEE మెయిన్స్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సత్తా, 500 మందికిపైగా అర్హత, గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి

  • Publish Date - September 15, 2020 / 12:08 PM IST

ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సోమవారం(డిసెంబర్ 14,2020) ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

దీనిపై ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందన్నారు. జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించిన విద్యార్థులకు సీఎం కేజ్రీవాల్ కంగ్రాట్స్ చెప్పారు. అలాగే టీచర్లకు కూడా కంగ్రాట్స్ చెప్పారు. శుక్రవారం రాత్రి జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చాయి.


ఢిల్లీకి చెందిన ఐదుగురు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వందకు వంద శాతం మార్కులు సాధించారు. ఆగస్టులో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ”ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న 510మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారు.

గత మూడేళ్లలో 2020లో 510మంది, 2019లో 473మంది, 2018లో 350మంది అర్హత సాధించారు. ప్రతి విద్యార్థి, టీచర్ కు కంగ్రాట్స్. నాకు చాలా గర్వంగా ఉంది. 98శాతం రిజల్ట్స్ తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు ఇది మరో అతిపెద్ద విజయం” అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ లో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈసారి 8లక్షల 58వేల విద్యార్థులు రిజిస్టర్ చేయించుకున్నారు. కాగా, 74శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.