Arvind Kejriwal
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అబద్ధం చెప్పారని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు దేశ రాజధానిని వదిలి వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వం చెప్పిందనే కామెంట్లపై ఇలా రెస్పాండ్ అయ్యారు.
‘ప్రధాని మోదీ చెప్పింది అబద్ధం. ఆయన సరిగ్గా చెప్పలేదు. ఇటువంటి తప్పుడు రాజకీయాలపై కామెంట్ చేయదలచుకోలేదు’ అని ప్రధాని గురించి చెప్పిన కేజ్రీవాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటలపైనా రెస్పాండ్ అయ్యారు.
‘యోగి ఏ భాషలో మాట్లాడారో నేనూ అదే రీతిలో జవాబిచ్చా. ఆయన అబద్ధం చెప్పారు’ అని యోగి గురించి కామెంట్ చేశారు. దాంతో పాటు బీజేపీ హిందూత్వ రాజకీయాలు చేస్తుందంటూ కామెంట్ చేశారు కేజ్రీవాల్.
Read Also : బస్సులో కోడిపుంజుకు టికెట్.. స్పందించిన సజ్జనార్
పంజాబ్ లో కాంగ్రెస్ నిలబెట్టిన సీఎం అభ్యర్థి రెండు సీట్లలోనూ ఓడిపోతాడని కామెంట్ చేశారు. ‘చన్నీ పంజాబ్ రెండు సీట్లలోనూ ఓడిపోవడం ఖాయం. నేనే గ్యారంటీ ఇస్తున్నా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం చేయలేదు’ అని అన్నారు కేజ్రీవాల్.