గోవా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంకు లీక్

క్షిణ గోవాలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది.

గోవా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంకు లీక్

Oxygen Tank

Updated On : May 11, 2021 / 6:03 PM IST

Oxygen tank దక్షిణ గోవాలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది. మెడికల్ ఆక్సిజన్​ను మరో పెద్ద ట్యాంకులోకి సరఫరా చేస్తుండగా ఆక్సిజన్​ లీకైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విపత్తు నిర్వాహణ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆక్సిజన్​ను అదుపు చేసే పనిలో విపత్తు సిబ్బంది నిమగ్నమయ్యారు. కొద్ది నిమిషాల్లోనే ఆస్పత్రి సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఈ ఘటనకు గల కారణాలపై తమకు నివేదిక అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి అధికారులు సూచించారు. సాంకేతిక అవాంతరాలు గురించి నాకు తెలియదు కీని ఏదో ఒకవిధంగా, కొన్ని బోల్ట్ లు ఊడాయి. కానీ ఇప్పుడు పరిస్థితి నియంత్రణలో ఉండది. ఆందోళన చెందాల్సిన పనిలేదని దక్షిణ గోవా కలెక్టర్ రుచికా కటియల్ తొలిపారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ట్యాంక్​ లీకై..పదుల సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.