PM Modi: సైన్యానికి ఫుల్‌ పవర్స్‌..! త్రివిధ దళాధిపతుల భేటీలో మోదీ సంచలన ప్రకటన

ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.

Pm modi

PM Modi: ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్చ, ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతుల సమావేశంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. యాక్షన్ ప్లాన్ లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ.

మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారతదేశం ప్రతిస్పందన, సమయం, లక్ష్యాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ఆయన తెలియజేశారు.

Also Read: పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్

ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లే కారణమని భారత్ చెబుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here