Pakistan Drones: మరోసారి బరితెగించిన పాకిస్తాన్.. జమ్ముకశ్మీర్ లో డ్రోన్ల దాడి..!

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది.

Pakistan Drones: పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు భారత్ పై దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. తాజాగా జమ్ముకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో దాడులకు దిగింది. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ డ్రోన్లను అడ్డుకుంది. వైమానిక రక్షణ వ్యవస్థ పాక్ డ్రోన్లను కూల్చేసింది.

ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత కూడా పాక్ తీరులో ఎటువంటి మార్పు లేదు. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్. సాంబా సెక్టార్ లోకి పాక్ డ్రోన్లు దూసుకొచ్చాయి. పాక్ డ్రోన్లను ఇండియన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.

Also Read: వారు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్‌ దెబ్బ తీసింది: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం