Pakistan Twitter Account Blocked: భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా బ్లాక్..! ఎందుకంటే..

భారత్‌లో పాకిస్థాన్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ట్విటర్ ఖాతా బ్లాక్ అయింది. అయితే, కొద్ది నెలలకే మళ్లీ పునరుద్దరించడం జరిగింది.

Pakistan Twitter Account Blocked: పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా (Twitter Account) ను భారత‌దేశంలో చూసేందుకు వీలుండదు. ఆ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా భారతదేశంలో నిషేధించబడినట్లు తెలుస్తోంది. ఇందుకు సరియైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్ (Twitter) వెల్లడించలేదు. ఈ కారణంగా భారతదేశంలో ఉన్నవారు @GovtofPakistan ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. ‘ఖాతా విత్‌హెల్ద్’ (Account withheld) అని వస్తుంది.

Twitter Blue: ఇండియాలో ట్విట్టర్ బ్లూ నెలకు రూ.9,400.. ఏప్రిల్ 1 నుంచి అమలు

గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నోటీసుల ప్రకారం.. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విటర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ ఐటీ మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా పనిచేస్తోంది.

 

 

భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ ధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ట్విటర్ ఖాతా బ్లాక్ అయింది. 2022 జులై, అక్టోబరు నెలల్లో ట్విటర్ ఖాతాను భారత్‌లో నిషేధించడం జరిగింది. అయితే కొన్ని నెలల తరువాత మళ్లీ పునరుద్దరించారు. తాజాగా మూడోసారి భారతదేశంలో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. గతంలో భారతదేశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఉద్దేశంతో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్‌బుక్ ఖాతాలను భారత్ నిషేధించిన విషయం విధితమే. ప్రస్తుతం ట్విటర్ నిర్ణయం వల్ల.. భారత్‌లో నివసిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన ట్విటర్ అకౌంట్‌లో ఎటువంటి సమాచారాన్ని చూడటానికి అవకాశం ఉండదు.

ట్రెండింగ్ వార్తలు